‘సడక్ 2’ ట్రైలర్‌కు డిస్ లైకుల మోత..!

'సడక్ 2' ట్రైలర్‌కు డిస్ లైకుల మోత..!

Sadak 2 Trailer: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సడక్ 2’ సినిమాపై నెపోటిజం ఎఫెక్ట్ బాగా పడింది. ఎప్పుడూ లేనంత విధంగా ఈ చిత్రం ట్రైలర్ కు రికార్డు స్థాయిలో డిస్ లైకుల మోత మోగుతోంది. సుశాంత్ సింగ్ మరణానికి కారణం బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం అని అతడి ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. దీనితో స్టార్ కిడ్స్ సినిమాలను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారు. అటు సుశాంత్ చనిపోవడానికి రియా చక్రవర్తితో పాటు […]

Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Aug 13, 2020 | 8:34 PM

Sadak 2 Trailer: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సడక్ 2’ సినిమాపై నెపోటిజం ఎఫెక్ట్ బాగా పడింది. ఎప్పుడూ లేనంత విధంగా ఈ చిత్రం ట్రైలర్ కు రికార్డు స్థాయిలో డిస్ లైకుల మోత మోగుతోంది. సుశాంత్ సింగ్ మరణానికి కారణం బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం అని అతడి ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. దీనితో స్టార్ కిడ్స్ సినిమాలను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారు.

అటు సుశాంత్ చనిపోవడానికి రియా చక్రవర్తితో పాటు మహేష్ భట్ కూడా కారణమని పలువురు అభిమానులు అనుకుంటుండటంతో.. ఈ ప్రభావం కాస్తా మహేష్ భట్ దర్శకత్వంలో వస్తున్న ‘సడక్‌ 2’పై ఉప్పెనలా పడింది. ఈ సినిమా ట్రైలర్ కు రికార్డు స్థాయిలో 65 లక్షల డిస్ లైక్స్ వచ్చాయి. ఒక్క రోజులో ఇన్ని ఎక్కువ డిస్ లైక్స్ పొందిన వీడియోలలో ఈ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా 7వ స్థానంలో నిలవగా.. దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. కాగా, సుశాంత్ గురించి గతంలో ఓ టీవీ షోలో అలియా చులకనగా మాట్లాడటం వల్లే.. అభిమానుల నుంచి ఈ వ్యతిరేకత ఎదురవుతోందని పలువురు భావిస్తున్నారు.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu