బీజేపీలో చేరడం లేదు-సచిన్ పైలట్

Sachin Pilot says hurt but not joining BJP : భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌డం లేద‌ని సచిన్ పైల‌ట్ తేల్చి చెప్పారు. బీజేపీలో చేరుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను పైల‌ట్ ఖండించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీపై పోరాడి గెలిచామ‌ని, ఇప్పుడు తానెందుకు బీజేపీలో చేరాల‌ని పైల‌ట్ ప్ర‌శ్నించారు. తాను బీజేపీలో చేరుతున్న‌ట్లు ఓ త‌ప్పుడు ప్ర‌చారం  జరుగుతోందని అన్నారు. ఇదిలా వుంటే… స‌చిన్ పైల‌ట్‌‌కు అన‌ర్హ‌త నోటీసులు జారీ చేసింది. రాజ‌స్థాన్ సీఎం అశోక్ […]

బీజేపీలో చేరడం లేదు-సచిన్ పైలట్
Follow us

|

Updated on: Jul 15, 2020 | 10:25 AM

Sachin Pilot says hurt but not joining BJP : భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌డం లేద‌ని సచిన్ పైల‌ట్ తేల్చి చెప్పారు. బీజేపీలో చేరుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను పైల‌ట్ ఖండించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీపై పోరాడి గెలిచామ‌ని, ఇప్పుడు తానెందుకు బీజేపీలో చేరాల‌ని పైల‌ట్ ప్ర‌శ్నించారు. తాను బీజేపీలో చేరుతున్న‌ట్లు ఓ త‌ప్పుడు ప్ర‌చారం  జరుగుతోందని అన్నారు.

ఇదిలా వుంటే… స‌చిన్ పైల‌ట్‌‌కు అన‌ర్హ‌త నోటీసులు జారీ చేసింది. రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై క‌త్తిదువ్విన పైల‌ట్‌ను డిప్యూటీ సీఎం ప‌ద‌వి నుంచి కూడా త‌ప్పించింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ ప‌ద‌వి నుంచి కూడా ఆయ‌న్ను తొల‌గించింది. పైల‌ట్‌తో పాటు ఆయ‌న‌ మద్దతుదారులకు నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న ఆరోప‌ణ‌ల‌పై నోటీసులో పేర్కొంది. అసెంబ్లీ స్పీక‌ర్ మొత్తం 19 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ స‌మావేశాల‌కు హాజ‌రు కానందు వ‌ల్ల అన‌ర్హ‌త వేటు వేస్తున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.