రైతులకు శుభవార్త.. వాళ్లందరికీ రుణ మాఫీ ..

కోవిద్-19 కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతు బంధుపై మాట్లాడిన ఆయన.

  • Tv9 Telugu
  • Publish Date - 12:04 pm, Wed, 6 May 20
రైతులకు శుభవార్త.. వాళ్లందరికీ రుణ మాఫీ ..

Rythu bandhu scheme: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతు బంధుపై మాట్లాడిన ఆయన.. కరోనా వున్నా, మరో సమస్య వచ్చినా రైతు బంధు పథకాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. రైతు బంధు పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

మరోవైపు.. అసెంబ్లీలో చెప్పినట్లుగానే రూ.25 వేల వరకూ రుణం తీసుకున్న రైతులందరికీ రుణ మాఫీ చేస్తాన్నారు. అందుకు కావాల్సిన రూ.1200 కోట్లను బుధవారమే విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో మద్దతు ధరకు ధాన్యం కొంటున్నామన్నారు. మక్కలు, శనగ, కందులు.. ఇలా ప్రతీ పంటను ప్రభుత్వం కొంటోందని.. కానీ కొందరు పనిగట్టుకొని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని.. వాళ్లు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. చిల్లర రాజకీయాలు చేసే వాళ్లను రైతులు నమ్మి మోసపోవద్దని సూచించారు.