Russia’s Coronavirus cases: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలమయ్యాయి. రష్యాలో గత 24 గంటల్లో 10,633 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలా దేశంలో ఒకేరోజు ఐదంకెల సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. ఇందులో 5345 కేసులు యాక్టివ్గా ఉన్నాయని అధికారులు తెలిపారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,687కు చేరింది. ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల 1,280 మంది మరణించారు. 16,639 మంది బాధితులు కోలుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 35,68,,904 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,48,347 మంది మరణించగా, 11,57,304 మంది కోలుకున్నారు.
Also Read: 45 నిముషాల్లో రూ. 2లక్షల లోన్.. 6 నెలల వరకు నో ఈఎంఐ..