Russia-Ukraine war: ఈ యుద్ధం కొన్నేళ్లు ఇలానే సాగుతుంది.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై నాటో చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు..

ఉక్రెయిన్‌ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు నాటో చీఫ్‌. అలాగే పశ్చిమ దేశాలు ఏం చేయాలో కూడా చెప్పారాయన.

Russia-Ukraine war: ఈ యుద్ధం కొన్నేళ్లు ఇలానే సాగుతుంది.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై నాటో చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు..
Nato Chief Jens Stoltenberg
Follow us

|

Updated on: Jun 19, 2022 | 8:23 PM

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగవచ్చని హెచ్చరించారు నాటో సెక్రటరీ జనరల్‌ స్టోల్టన్‌బర్గ్. దానికి తగ్గట్టుగా ఉక్రెయిన్‌కు సాయం అదించేందుకు పశ్చిమ దేశాలు సిద్ధం కావాలని ఆయన సూచించారు. సుదీర్ఘ కాలం యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు ప్రిపేర్‌ కావాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వ్యాఖ్యల తర్వాత నాటో చీఫ్‌ కూడా అదే తరహాలో వార్న్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్నేళ్ల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉందని, అయితే ఉక్రెయిన్‌కు సహాయం అందించడంలో పశ్చిమ దేశాలు మధ్యలో చేతులెత్తేయకూడదని చెప్పారు నాటో సెక్రటరీ జనరల్‌. ఉక్రెయిన్‌కు ఆధునిక ఆయుధాల సరఫరా అవసరాన్ని కూడా చెప్పారాయన. ఉక్రెయన్‌కు మోడర్న్‌ వెపన్స్‌ సమకూరిస్తే డాన్‌బాస్‌ ప్రాంతాన్ని తిరిగి సాధించుకోలగదని చెప్పారు.

ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతమైన డాన్‌బాస్‌ చాలా వరకు రష్యా ఆధీనంలో ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై నాలుగు నెలలు అయింది. రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా పలు ప్రాంతాలు నామరూపాలు కోల్పోయాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. చిన్న దేశమే అయినా పశ్చిమ దేశాల సహకారంతో రష్యాను ఎదుర్కొంటూ వస్తోంది ఉక్రెయిన్‌.

ఇటీవలే ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాధినేతలు ఉక్రెయిన్‌లో పర్యటించి అధ్యక్షుడు జెలన్‌స్కీకి తమ మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా యూరోపియన్‌ యూనియన్‌లో ఉక్రెయిన్‌ క్యాండిడేట్‌ హోదాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పుడు నాటో చీఫ్‌ వ్యాఖ్యలతో ఉక్రెయిన్‌ యుద్ధానికి ఇప్పట్లో ఎండ్‌ కార్డ్‌ పడదన్న విషయం క్లియర్‌ అయింది.

అంతర్జాతీయ వార్తల కోసం