‘ఆర్టీఐ ‘ బిల్లు.. మూడు పార్టీలపై మాజీ సీఐసీ ఆగ్రహం

ప్రధాని మోదీ ప్రభుత్వం తెచ్చిన ఆర్టీఐ సవరణ బిల్లుకు టీఆర్ఎస్, వైసీపీ, బిజూ జనతాదళ్ (బీజేడీ) మద్దతు తెలపడంపట్ల మాజీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఈ పార్టీలకు ఓ లేఖ రాస్తూ.. అసలు ఈ సవరణ బిల్లును మీరుగానీ, మీ ఎంపీలుగానీ చదివారా అని ప్రశ్నించారు. లోక్ సభలో ఈ బిల్లు ఇటీవల ఆమోదం పొందగా,, రాజ్యసభ గురువారం ఆమోదించింది. రాజ్యసభనుంచి కాంగ్రెస్, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, […]

'ఆర్టీఐ ' బిల్లు.. మూడు పార్టీలపై మాజీ సీఐసీ ఆగ్రహం
Follow us

|

Updated on: Jul 27, 2019 | 1:53 PM

ప్రధాని మోదీ ప్రభుత్వం తెచ్చిన ఆర్టీఐ సవరణ బిల్లుకు టీఆర్ఎస్, వైసీపీ, బిజూ జనతాదళ్ (బీజేడీ) మద్దతు తెలపడంపట్ల మాజీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఈ పార్టీలకు ఓ లేఖ రాస్తూ.. అసలు ఈ సవరణ బిల్లును మీరుగానీ, మీ ఎంపీలుగానీ చదివారా అని ప్రశ్నించారు. లోక్ సభలో ఈ బిల్లు ఇటీవల ఆమోదం పొందగా,, రాజ్యసభ గురువారం ఆమోదించింది. రాజ్యసభనుంచి కాంగ్రెస్, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, ఇతర విపక్షపార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశాయి. దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని ఈ పార్టీల సభ్యులు కోరగా.. అందుకు ప్రభుత్వం నిరాకరించి ఓటింగ్ కు పెట్టింది. ఓటింగులో బిల్లుకు అనుకూలంగా 117 మంది, వ్యతిరేకంగా 75 మంది ఓటు చేయడంతో దీన్ని సభ ఆమోదించింది. అలాగే లోక్ సభలో అంతకుముందు ఈ బిల్లుకు అనుకూలంగా 218 మంది, ప్రతికూలంగా 79 మంది సభ్యులు ఓటు చేశారు. (దాంతో లోక్ సభ ఆమోదం కూడా దీనికి లభించింది). ఈ సవరణ బిల్లు వల్ల కలిగే కొత్త సమస్యలను మీరు గుర్తించ లేదని శ్రీధరాచార్యులు తన లేఖలో తెరాస, వైసీపీ, బీజేడీ నేతలను విమర్శించారు. మీరంతా ప్రజా సంక్షేమానికి పాటు పడే నాయకులని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎన్నో త్యాగాలు చేశారని సెటైర్ వేసిన ఆయన.. అయితే ఈ బిల్లులోని కొన్ని అంశాల విషయంలో మొదట మీరు న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవలసి ఉండిందని పేర్కొన్నారు. ఇందులోని అంశాలు రాష్ట్రాల అధికారాలను హరించేవిగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. బిల్లులోని సెక్షన్ 4 (1) సీ వంటివి మోరల్ గా, లీగల్ గా, రాజ్యాంగపరంగా, రాజకీయంగా కూడా వివిధ రాష్ట్రాల హక్కులను నీరుగార్చేవిగా ఉన్న విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ఈ చర్య . అధికార ‘ కేంద్రీకృతం ‘గా ఉందని, ,ఇన్ఫర్మేషన్ కమిషనర్ల జీతాలు, ఇతర ప్రయోజనాల కల్పనలో కేంద్రానికే అధికారాలను కట్టబెడుతూ ఈ సవరణబిల్లులో నిర్దేశించారని ఆయన అన్నారు. . అటు- ప్రతిపక్షాల సభ్యులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టీఐ చట్టానికి ఇది గండి కొడుతోందని, ప్రభుత్వం సీఐసి హక్కులను అణచి వేస్తోందని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఇటీవల లోక్ సభలో తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.