సర్కార్‌తో తాడో.. పేడో..! ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం..! అవసరమైతే.. తెలంగాణ బంద్..!

టీఎస్ఆర్టీసీ సమస్యలపై తాజాగా.. ఇవాళ అఖిలపక్షం సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి.. పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను జేఏసీ నేతలు ఆహ్వానించారు. ఈ భేటీ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ముఖ్య ఉద్ధేశం జీత భత్యాలు.. పెంచి.. మా కడుపు నింపుకోవడం కాదని.. ఆర్టీసీని బతికించుకోవడమే తమ తపనని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని.. అదేవిధంగా ప్రైవేటు పరం చేయొద్దని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిని చెల్లిస్తే […]

సర్కార్‌తో తాడో.. పేడో..! ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం..! అవసరమైతే.. తెలంగాణ బంద్..!
Follow us

| Edited By:

Updated on: Oct 09, 2019 | 3:51 PM

టీఎస్ఆర్టీసీ సమస్యలపై తాజాగా.. ఇవాళ అఖిలపక్షం సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి.. పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను జేఏసీ నేతలు ఆహ్వానించారు. ఈ భేటీ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ముఖ్య ఉద్ధేశం జీత భత్యాలు.. పెంచి.. మా కడుపు నింపుకోవడం కాదని.. ఆర్టీసీని బతికించుకోవడమే తమ తపనని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని.. అదేవిధంగా ప్రైవేటు పరం చేయొద్దని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిని చెల్లిస్తే నష్టాల నుండి.. లాభాల దిశగా వెళ్తుందని కార్మిక సంఘాల తమ ప్రధాన డిమాండ్‌లుగా జేఏసీ కన్వీనర్‌ పేర్కొన్నారు.

అయితే.. విధులకు హాజరుకానీ వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించినా.. కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె ప్రభావాన్ని తగ్గించడంపోయి.. సీఎం ఇలా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. సీఎం నిర్ణయాలు ఏకాభిప్రాయంగా ఉన్నాయని.. నేనే రాజు.. నేనే మంత్రి అన్న చందంగా.. ఆయన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. కార్మికులు దాచుకున్న పీఎఫ్‌ డబ్బును ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీపై డీజీల్ భారం ఎక్కువైందన్నారు. రాష్ట్రంలో నాలుగో వంతు ప్రజలు ఆర్టీసీపై ఆధారపడి ఉన్నారని.. వారంతా సమ్మెకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. అవసరమైతే తెలంగాణ బంద్‌కు కూడా పిలుపునిస్తామని వ్యాఖ్యానించారు. అలాగే.. ప్రజలు కూడా మా సమస్యలను అర్థంచేసుకుని.. సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే.. ఎల్లుండి గవర్నర్‌ను కలిసి వినతిపత్రాలను అందజేస్తామన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే 10 రోజుల్లో బంద్‌కు పిలుపునిస్తామన్నారు జేఏసీ కన్వీనర్.

కాగా.. ఆర్టీసీ సమ్మెకు టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, టీజేఎస్ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు.

  • స్వరాష్ట్రంలో ఇంతపెద్ద సమ్మె ఆర్టీసీఎస్‌కు చెంపదెబ్బ: బీజేపీ నేత రామచందర్‌ రావు
  •  ఆర్టీసీపై కేసీఆర్ ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపిస్తున్నారు: టీడీపీ నేత రావుల
  •  ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌కు పాలేర్లు కాదు: సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం