తారక్ అభిమానులకు గుడ్ న్యూస్ !

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించడమే ఒక సెన్సేషన్. దానికి రాజమౌళి డైరెక్షన్ అంటే ఆ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాలా.   ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న సినిమా.  ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే కీలకక పాత్రలో నటించబోతున్నట్టు ఇప్పటికే రాజమౌళి […]

  • Ram Naramaneni
  • Publish Date - 10:33 pm, Mon, 21 September 20
తారక్ అభిమానులకు గుడ్ న్యూస్ !

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించడమే ఒక సెన్సేషన్. దానికి రాజమౌళి డైరెక్షన్ అంటే ఆ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాలా.   ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న సినిమా.  ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే కీలకక పాత్రలో నటించబోతున్నట్టు ఇప్పటికే రాజమౌళి స్పష్టం చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు గగనానికి ఎగశాయి. పైగా బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో సినిమా క్రేజ్ మాటలకు అందడం లేదు. ఈ సినిమాకు తెలుగులో రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ గెటప్‌కు సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు

ఇక ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఏదైనా టీజర్ వస్తుందని ఆశించిన అభిమానులకు మాత్రం నిరాశ తప్పలేదు. అప్పటికే దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో తారక్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయలేకపోతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో షూటింగ్ పున: ప్రారంభించాలనుకుంటున్నారు.  వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్  ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఎన్టీఆర్, చరణ్ కాకుండా మిగతా నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చెయ్యనున్నారు. ఈ సందర్భంగా దసరాకు ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చెయ్యనున్నట్లు తెలుస్తోంది. ఎన్నో రోజులుగా కొమరం భీమ్‌గా తారక్‌ను చూడాలనుకున్న ఫ్యాన్స్  కల త్వరలో నెరవేరబోతున్నదన్నమాట.

Also Read :

రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ !

సామాన్యులకు మరో షాక్, పెరగనున్న టీవీల ధరలు

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కోడిగుడ్డు ధర !