‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది…

RRR Movie Update: రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది జూలై 30న విడుదల కావాల్సిన ఈ మూవీ రిలీజ్ డేట్ మారింది. వచ్చే సంవత్సరం జనవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా […]

'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది...

RRR Movie Update: రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది జూలై 30న విడుదల కావాల్సిన ఈ మూవీ రిలీజ్ డేట్ మారింది. వచ్చే సంవత్సరం జనవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. ‘బాహుబలి’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా అద్భుత దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్నామని అందుకే విడుదల తేదీని మార్చాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రామ్ చరణ్ సరసన నటిస్తుండగా.. హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, సముద్రఖని, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత జక్కన్న నుంచి వస్తోన్న చిత్రం కావడం.. అంతేకాక రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Published On - 5:32 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu