పూలజల్లుకు కారణమిదే! నిజం చెప్పిన రోజా

గత ఆదివారం (ఏప్రిల్ 19న) తనపై పూలు జల్లుతూ ఓ గ్రామస్తులు స్వాగతం పలికిన ఉదంతంపై చెలరేగిన రాజకీయ దుమారానికి తెరదించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సెల్వమణి. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ఓవైపు...

  • Rajesh Sharma
  • Publish Date - 8:09 pm, Tue, 21 April 20
పూలజల్లుకు కారణమిదే! నిజం చెప్పిన రోజా

గత ఆదివారం (ఏప్రిల్ 19న) తనపై పూలు జల్లుతూ ఓ గ్రామస్తులు స్వాగతం పలికిన ఉదంతంపై చెలరేగిన రాజకీయ దుమారానికి తెరదించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సెల్వమణి. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ఓవైపు… సోషల్ డిస్టెన్స్ పాటించమన్న ప్రభుత్వ ఆదేశాల ఇంకోవైపు.. ఈ క్రమంలో రోజాను పూలు జల్లుతూ స్వాగతించిన ఓ గ్రామస్తుల వ్యవహారంపై మంగళవారం రాద్దాంతం చెలరేగిన సంగతి తెలిసిందే.

వ్యక్తిత్వ పూజకు రోజా ప్రాధాన్యమిచ్చారని, కరోనా హెచ్చరికలను సైతం రోజా పట్టించుకోలేదని టీడీపీ నేతలు పలువురు రోజాపై విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ గ్రామస్తులెందుకు అలా చేశారో కారణం చెప్పడం ద్వారా వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. జనాలతో తనపై పూవులు జల్లించుకున్న వైనంపై వివరణ ఇచ్చారు రోజా.

‘‘ పుత్తూరు ప్రజలు గత ఐదేళ్లలో మంచినీళ్లు లేక తిప్పలు పడుతుంటే నేను నీళ్లు ఇప్పించాను.. నీళ్లు ఇచ్చానన్న ఆనందంతో ప్రజలు నాపై ఆనందంతో పూవులు చల్లారు.. అక్కడ మహిళలు కూడా గ్లౌజులు ధరించి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటెయిన్ చేస్తూ నాపై పూవులు చల్లారు.. చంద్రబాబు హయాంలో పుత్తూరుకు నీళ్లు ఇవ్వలేకపోయారు.. నేను నీళ్ళు రప్పించానన్న ఆనందంతోనే అలా చేశారు.. ’’ అని రోజా అన్నారు.

తనపై పూవులు జల్లిన వ్యవహారంలో తనపై అనవసరంగా బురద జల్లుతున్నారని రోజా విమర్శించారు. గత ఆదివారం పుత్తూరులో ఎమ్మెల్యే రోజాపై పూవులు చల్లిన వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం రోజా క్లారిటీ ఇచ్చారు. తాగునీరిచ్చిన కృతఙ్ఞతతో వారు చూపిన అభిమానాన్ని రాజకీయం చేయొద్దన్నారు రోజా.