‘ఖేల్ రత్న’ రేసులో రోహిత్ శర్మ పేరు..!

సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్ల లిస్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చోటు దక్కించుకుంటాడా.? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.

  • Ravi Kiran
  • Publish Date - 2:02 pm, Mon, 17 August 20
'ఖేల్ రత్న' రేసులో రోహిత్ శర్మ పేరు..!

Rohit Sharma in Khel Ratna Race:  సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్ల లిస్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చోటు దక్కించుకుంటాడా.? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు రేసులో రోహిత్ శర్మ పేరు కూడా ఉంది. ఖేల్ రత్నతో పాటు అర్జున అవార్డు, ఇతర క్రీడా పురస్కారాల కోసం పలువురు క్రీడాకారులు చేసుకున్న దరఖాస్తులను సెలక్షన్ ప్యానల్ నిన్న, ఇవాళ పరిశీలించి.. అర్హత కలిగిన వారిని అవార్డుల కోసం ఎంపిక చేయనుంది.

కాగా, 1992 నుంచి ఇస్తున్న ఈ అవార్డును సచిన్ టెండూల్కర్ 1998లో, అలాగే ధోని 2007లో, విరాట్ కోహ్లీ 2018లో అందుకున్నారు. దాదాపు ప్రతీ పదేళ్లకు ఒకసారి క్రికెటర్లకు ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఇక ఈ సంవత్సరం ఖేల్ రత్న అవార్డు కోసం 20కి పైగా విభాగాలకు చెందిన 40 మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకున్నారు.

పుల్లెల గోపిచంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధు, కె. శ్రీకాంత్ బ్యాడ్మింటన్ నుంచి, పారా అథ్లెట్ల నుంచి దేవేంద్ర జాజారియా, దీపా మాలిక్.. అంతేకాకుండా జోషనా చైనప్ప (స్క్వాష్), మణికా బాత్రా (టేబుల్ టెన్నిస్), రాణి రాంపాల్ (హాకీ), వినేష్ ఫోగట్ (కుస్తీ), పృథ్వీ శేఖర్ (టెన్నిస్), జ్యోతి సురేఖ (విలువిద్య) లాంటి ప్రముఖ అథ్లెట్లు ఈ ఖేల్ రత్న రేసులో ఉన్నారు.

Also Read:

ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!

ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…

‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్

కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!