హిట్ మ్యాన్ ఖాతాలో మరో రికార్డు… ఆసీస్ సిరీస్ ఆడకుండానే చరిత్ర క్రియేట్ చేసిన రోహిత్​ శర్మ..వరుసగా ఇది ఎనిమిదోసారి

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. వన్డేల్లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రోహిత్​ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా సిరీస్​కు ఎంపిక కాకపోయినా సరే హిట్​మ్యాన్​ ఈ ఘనతను సొంతం..

హిట్ మ్యాన్ ఖాతాలో మరో రికార్డు... ఆసీస్ సిరీస్ ఆడకుండానే చరిత్ర క్రియేట్ చేసిన రోహిత్​ శర్మ..వరుసగా ఇది ఎనిమిదోసారి
Follow us

|

Updated on: Dec 02, 2020 | 6:38 PM

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. వన్డేల్లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రోహిత్​ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా సిరీస్​కు ఎంపిక కాకపోయినా సరే హిట్​మ్యాన్​ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. ఇదే కాదు మరో రికార్డు కూడా హిట్ మ్యాన్ ఖాతాలో వచ్చి చేరింది. ఇలాంటి రికార్డును వరుసగా ఎనిమిదోసారి సొంతం చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ ఏ ఒక్క భారత ఆటగాడు కూడా మూడంకెల స్కోరు చేయని విషయం తెలిసిందే. దీంతో 2020లోనూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్‌ నిలిచాడు.

ఈ ఏడాది జనవరి 19న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రోహిత్‌ 119 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. 2020లో భారత్‌ తరఫున ఓ ఆటగాడు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. వరుసగా ఎనిమిదో ఏడాది కూడా ఎవరికీ సాధ్యంకానీ అత్యధిక పరుగుల రికార్డును రోహిత్‌ కొనసాగిస్తుండటం విశేషం. తొడ కండరాల గాయం నుంచి రోహిత్‌ పూర్తిగా కోలుకోకపోవడంతో వన్డేలు, టీ20 సిరీస్‌లకు అతన్ని ఎంపిక చేయలేదు బీసీసీఐ.