అక్కడ.. కరోనా రోగుల సేవలో.. రోబోలు..!

కొవిడ్‌-19 ప్రపంచ దేశాలతో పాటు భారత్ నూ గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసేందుకు వైద్యులు కొత్తగా రోబోలను రంగంలోకి దించారు. జైపూర్ నగరంలో సవాయ్ మాన్‌సింగ్ ఆసుప్రతిలో ని కరోనా వైరస్

అక్కడ.. కరోనా రోగుల సేవలో.. రోబోలు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 26, 2020 | 6:03 PM

కొవిడ్‌-19 ప్రపంచ దేశాలతో పాటు భారత్ నూ గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసేందుకు వైద్యులు కొత్తగా రోబోలను రంగంలోకి దించారు. జైపూర్ నగరంలో సవాయ్ మాన్‌సింగ్ ఆసుప్రతిలో ని కరోనా వైరస్ పాజిటివ్ రోగులకు చికిత్స చేసేందుకు ఉద్దేశించిన ఐసోలేషన్ వార్డులో వైద్యసేవలు అందించేందుకు రోబోలను రంగంలోకి దించామని ఆసుపత్రి డాక్టర్ డీఎస్ మీనా చెప్పారు. జోద్‌పూర్ నగరానికి చెందిన ఓ వ్యక్తి తయారు చేసిన ఈ నర్సింగ్ రోబోలను ఎలాంటి చార్జీలు తీసుకోకుండా పనిచేసేందుకు ఆసుపత్రిలో ప్రవేశపెట్టారని డాక్టర్ మీనా పేర్కొన్నారు.

కాగా.. కరోనా వైరస్ రోగులకు నర్సుల స్థానంలో ఈ రోబోలు వైద్య సేవలు అందిస్తున్నాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బుధవారం ఈ రోబోలు కరోనా రోగులకు చికిత్స అందించడంలో విజయవంతం అయ్యాయని డాక్టర్ మీనా వివరించారు. బ్యాటరీతో పనిచేసే ఈ రోబోల జీవిత కాలం 4 నుంచి 5ఏళ్లు అని వైద్యులు చెప్పారు. రోబోలను నర్సింగ్ సేవల కోసం ప్రవేశపెట్టడంతో నర్సులకు కరోనా వైరస్ సోకకుండా సురక్షితంగా ఉండవచ్చని వైద్యులు పేర్కొన్నారు.