గుంటూరు జిల్లాలో దారుణం.. పెళ్లి ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చుండూరు మండలం చినపరిమి వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. కొంతమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తెనాలిలో పెళ్లికి వెళ్లి చుండూరులోని మాలపల్లికి తిరిగి వస్తుండగా చినపరిమి వద్ద రహదారి మలుపు తిరుగుతున్న సమయంలో ట్రాక్టర్‌ […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:39 pm, Thu, 20 February 20
గుంటూరు జిల్లాలో దారుణం.. పెళ్లి ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చుండూరు మండలం చినపరిమి వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. కొంతమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తెనాలిలో పెళ్లికి వెళ్లి చుండూరులోని మాలపల్లికి తిరిగి వస్తుండగా చినపరిమి వద్ద రహదారి మలుపు తిరుగుతున్న సమయంలో ట్రాక్టర్‌ బోల్తా పడింది.