రేవంత్ అరాచకాలు..కాంగ్రెస్‌లో ప్రకంపనలు..మండిపడుతున్న సీనియర్లు…

Revanth Reddy Scams: అక్రమాలు.. భూకబ్జాలు.. స్వార్ధ రాజకీయాలు.. పదవి కోసం పాకులాటలు.. ఇలా ఎంపీ రేవంత్ రెడ్డి చేసే పనులన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనితో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌ హోదాలో ఉండి.. పర్సనల్‌ అజెండానే వర్క్‌గా మార్చుకున్న ఆయనకు సీనియర్ల నుంచి ఈసడింపు తప్పడం లేదు. నింద అయితే నిరూపించుకో.. తప్పయితే సరిదిద్దుకో అని పదేపదే చెబుతున్నా.. పట్టించుకోని రేవంత్‌ సీన్‌ని ఇప్పుడు పార్టీ పెద్దల ముందుకు తీసుకొస్తున్నారు కాంగ్రెస్ […]

రేవంత్ అరాచకాలు..కాంగ్రెస్‌లో ప్రకంపనలు..మండిపడుతున్న సీనియర్లు...
Follow us

|

Updated on: Mar 13, 2020 | 2:29 PM

Revanth Reddy Scams: అక్రమాలు.. భూకబ్జాలు.. స్వార్ధ రాజకీయాలు.. పదవి కోసం పాకులాటలు.. ఇలా ఎంపీ రేవంత్ రెడ్డి చేసే పనులన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనితో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌ హోదాలో ఉండి.. పర్సనల్‌ అజెండానే వర్క్‌గా మార్చుకున్న ఆయనకు సీనియర్ల నుంచి ఈసడింపు తప్పడం లేదు. నింద అయితే నిరూపించుకో.. తప్పయితే సరిదిద్దుకో అని పదేపదే చెబుతున్నా.. పట్టించుకోని రేవంత్‌ సీన్‌ని ఇప్పుడు పార్టీ పెద్దల ముందుకు తీసుకొస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. ఆయన తీరు పట్ల అందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ వ్యవహారంపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు వచ్చినా రేవంత్ ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదు. లాభం జరిగితే తనకూ.. నష్టం జరిగితే పార్టీకీ అన్నట్లే వ్యవహరిస్తూ వస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ తీరు హస్తం పార్టీలో చిచ్చు రేపుతోంది. స్వార్ధ ప్రయోజనాలతో పార్టీ పరువు తీస్తున్నారంటూ ఆయనపై సీనియర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఏ అంశంపై పార్టీ పరంగా పోరాటం చేయాలన్నా.. ముందు అందరితో చర్చించాలన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందరి నిర్ణయంతోనే ముందుకు సాగాలని.. రేవంత్‌లా సొంత ఎజెండాలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం సరికాదంటున్నారు. టీడీపీలో ఉన్నప్పుడూ సేనియర్లందరిని సైడ్ చేసేసిన రేవంత్.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కూడా అదే వ్యవహారశైలిని కొనసాగించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారానికి తెరలేపిన ఆయన ఆ కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుపాలయ్యారు. దీనితో తెలంగాణలో టీడీపీ ఖతం అయిపొయింది. అయితే రేవంత్ మాత్రం ఈ కేసు ద్వారా హైకమాండ్ నుంచి లబ్ది పొందారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇక పార్టీ పరిస్థితి దిగజారాక.. తట్టాబుట్టా సర్దుకుని కాంగ్రెస్‌లోకి జంప్ అయిపోయి.. టీడీపీని నిండా ముంచేశారు. ఇప్పుడే ఇదే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీకి కూడా పట్టించేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు జరుపుతున్నారు. పీసీసీ పదవిపై ఎప్పటినుంచో కన్నేసిన రేవంత్.. ఇప్పటికే ఢిల్లీలో మేనేజ్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పొందారు. ఇక నెక్స్ట్ టార్గెట్ పీసీసీ పోస్ట్.. దీని కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన సమయంలోనే గోపన్‌పల్లి భూదందాలో అడ్డంగా దొరికిపోయారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేయగా.. రేవంత్ అక్రమాల చిట్టా అంతా బయటపడింది. వందల కోట్లు విలువ గలిగిన దళితులు, ప్రభుత్వ భూములను రేవంత్ రెడ్డి అడ్డుగోలుగా ఆక్రమించుకున్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఇక ఈ దందా విషయంపై రేవంత్ దగ్గర ఎటువంటి సమాధానం లేకపోగా.. ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వంపై తాను ఒక్కడినే పోరాడుతున్నానని ఢిల్లీలో చెప్పుకోవడానికి సడన్‌గా జీవో 111ను తెరపైకి తీసుకొచ్చారు. పార్టీ నేతలతో చర్చించకుండా అత్యుత్సాహం ప్రదర్శించిన ఆయన చట్టవిరుద్ధంగా డ్రోన్ కెమెరాలతో కేటీఆర్ ఫామ్ హౌస్‌ను వీడియోలు తీయించారు. ఇక దీనిపై కేసు నమోదు కావడంతో మరో నాటకానికి తెర లేచింది.

పార్లమెంట్ సమావేశాల సమయంలో అరెస్ట్ అయితే.. తన అంశం లోక్‌సభలో ప్రస్తావనకు వస్తుందని ఊహించి లొంగిపోగా.. రేవంత్ సీన్ మొత్తం రివర్స్ అయింది. అప్పటికే రేవంత్ వ్యవహారం, భూ దందాలపై కాంగ్రెస్ హైకమాండ్‌కు రిపోర్ట్ వెళ్ళింది. అయితే పార్టీ పెద్దల నుంచి దీనిపై పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ప్రచారానికి రేవంత్ రెడ్డి అనుచరులు తెరలేపారు. జీవో 111కు టీపీసీసీ పదవికి లింక్ పెట్టి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారు. కోర్‌కమిటీలో తక్షణం రేవంత్ వ్యవహారాన్ని తేల్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ వ్యవహారంపై ఓ నిర్ణయానికి రాకపోతే టీడీపీలానే కాంగ్రెస్‌ను కూడా ముంచేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు.

For More News:

కరోనా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బాబుకు మరో షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ.?

అమృతం ‘ద్వితీయం’.. నిజంగా అద్వితీయం..

ఎయిడ్స్ మందులతో కరోనాకు చికిత్స…

మాచర్ల ఘటనలో గాయపడ్డ న్యాయవాది పరిస్థితి విషయంః బోండా ఉమా

కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలు సహా అందుబాటులో 24 గంటల సేవలు..

‘ప్రేమ ఎంత మధురం’.. ఆర్య ఓ రూలర్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జెండే.. షాక్‌లో అను..

ఐపీఎల్ రద్దుతో బీసీసీఐపై భారం.. 10 వేల కోట్లు నష్టం..?

ఏకగ్రీవ పంచాయితీలకు జగన్ సర్కార్ బంపరాఫర్…

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..