AP Local Body Election Schedule : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ఏపీ సర్కార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఎలక్షన్ కమిషన్‌ మధ్య సాగుతున్న వార్‌కు.. SEC నిమ్మగడ్డ మరో ట్విస్ట్ ఇచ్చారు. ప్రభుత్వం ససేమీరా అన్నా.. ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

AP Local Body Election Schedule : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల..
Follow us

|

Updated on: Jan 08, 2021 | 9:54 PM

ఏపీలో ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ సర్కార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఎలక్షన్ కమిషన్‌ మధ్య సాగుతున్న వార్‌కు.. SEC నిమ్మగడ్డ మరో ట్విస్ట్ ఇచ్చారు. ప్రభుత్వం ససేమీరా అన్నా.. ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్‌ను కూడా రిలీజ్‌ చేసేశారు. తొలి దశ ఎన్నికలకు జనవరి 23న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.. ఫిబ్రవరి 2న ఎన్నికలను నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికలకు జనవరి 27న నోటిఫికేషన్‌ రానుండగా.. ఎన్నికలు ఫిబ్రవరి 9న జరగనున్నాయి. మూడోదశ ఎన్నికలకు జనవరి 31న నోటిఫికేషన్ ఇచ్చి.. ఫిబ్రవరి 13న పోలింగ్‌ చేపట్టనున్నారు.. నాలుగోదశ ఎన్నికలకు ఫిబ్రవరి 4న నోటిఫికేషన్‌ ఇచ్చి.. ఫిబ్రవరి 17న పోలింగ్‌ నిర్వహిస్తారు.. ఎన్నికల కోడ్‌ కూడా రేపట్నుంచే అమల్లోకి రానుంది.

ఎన్నికల నిర్వహణపై ఇవాళ సాయంత్రమే SEC నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు ఏపీ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌. గంటన్నరపాటు నిమ్మగడ్డతో చర్చించారు. కరోనా స్ర్టెయిన్‌తో మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని వివరించారు. వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్రం ఆదేశాలు ఇవ్వడంతో సిబ్బంది అంతా ఆ బిజీలో ఉన్నారని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కరెక్ట్‌ కాదని సూచించారు. మరోవైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయన్న వివరాలను అందించారు. కాబట్టి ఫిబ్రవరిలో ఎన్నికలు జరపకుండా వాయిదా వేయాలని కోరారు.

ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరపడానికి ముందు నుంచి కసరత్తు చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. దీన్ని ప్రభుత్వం వ్యతిరేకించడంతో.. హైకోర్టుకు వెళ్లారు SEC. చివరకు ముగ్గురు అధికారులు వెళ్లి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో చర్చించాలని కోర్టుకు ఆదేశించింది. ఆ ప్రకారమే సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అశోక్‌కుమార్‌ సింఘాల్‌, పంచాయతీ రాజ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది… నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో చర్చించారు. అయితే.. ఈ చర్చలు జరిగిన కాసేపటికే.. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్‌ను విడుదల చేయడం పొలిటికల్‌గా హీట్‌ను పెంచేసింది.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు