పాత పద్దతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ అధికార యంత్రాంగం..

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం పాత పద్దతిలోనే రిజిస్ర్టేషన్లను ప్రారంభించనుంది.

పాత పద్దతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ అధికార యంత్రాంగం..
Follow us

|

Updated on: Dec 21, 2020 | 5:42 AM

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం పాత పద్దతిలోనే రిజిస్ర్టేషన్లను ప్రారంభించనుంది. సోమవారం నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది. శనివారం నుంచే స్లాట్ బుకింగ్ రద్దు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఏ విధమైన పద్దతులు పాటించాలని, అవలంభించాల్సిన విధి విధానాలను తెలియజేశారు. రద్దీ అధికంగా ఉంటే టోకెన్ సిస్టమ్ సూచించాలని తెలిపారు. డాక్యుమెంట్ల పరిశీలనలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరించారు.

రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కార్డ్‌ విధానంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు అంతా సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు సమాయత్తం చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారితో ఎలాంటి గొడవలు, వాగ్వాదాలు జరగకుండా మర్యాదగా నడుచుకోవాలని, బలమైన కారణాలు ఉంటే తప్ప కొర్రీలు వేయకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టం చేశారు. ఎల్‌ఆర్ఎస్ లేనివాటికి రిజిస్ట్రేషన్లు జరగవని, భవన నిర్మాణ అనుమతులు ఉన్న వాటికే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వెల్లడించారు. కాగా రిజిస్ట్రేషన్ల విధానాన్ని సమూలంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌ 8 నుంచి ప్రక్రియను నిలిపి వేసింది. సంస్కరణల్లో భాగంగా ధరణి వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించిన సంగతి తెలిసిందే.

3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..