స్వాతంత్ర్య దినోత్సవానికి ముస్తాబైన ఎర్రకోట

దేశ స్వాతంత్ర్య దినోత్సవాలకు భారతావని ముస్తాబవుతోంది. ఆ సేతు హిమాచలం ఘనంగా ఉత్సవాలకు రెఢీ అవుతోంది. అటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట సిద్ధమైంది. శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేస్తారు.

స్వాతంత్ర్య దినోత్సవానికి ముస్తాబైన ఎర్రకోట
Follow us

|

Updated on: Aug 14, 2020 | 12:58 PM

దేశ స్వాతంత్ర్య దినోత్సవాలకు భారతావని ముస్తాబవుతోంది. ఆ సేతు హిమాచలం ఘనంగా ఉత్సవాలకు రెఢీ అవుతోంది. అటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట సిద్ధమైంది. శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. దీంతో ఎర్రకోట పరిసర ప్రాంతాలన్నీ రక్షణ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎర్రకోట పూర్తిగా పోలీస్ వలయంలోకి వెళ్లిపోయాయి. ఇప్పటికే రిహార్సల్ చేశారు. కరోనా ప్రభావంతో అందరినీ కలుపుకుని 5వేల మందికి మాత్రమే ఏర్పాట్లు చేశారు అధికారులు. సామాజిక దూరం పాటించే విధంగా కుర్చీలను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు, కేంద్రపారామిలటరీ బలగాలతో ఎర్రకోట ప్రాంతమంతా జల్లెడపడుతున్నారు. ప్రధాని ప్రసంగించే వేదిక చుట్టూ బుల్లెట్ ఫ్రూప్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ప్రత్యేక అహ్వానితులుగా కొవిడ్ నుంచి కోలుకున్న వారు హాజరవుతున్నారు.