విజయసాయిరెడ్డి ఎంపికకు కారణమేంటి..?

పార్లమెంటరీ స్థాయి సంఘాలను స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించారు. అసలు విజయసాయిరెడ్డికి కీలక పదవి ఇవ్వడానికి కారణమేంటి..? టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కూడా ఇంకా ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నారు అయినప్పటికీ విజయసాయిరెడ్డినే ఎందుకు నియమించాల్సి వచ్చింది..? బీజేపీ చెప్పినట్లే వైసీపీ చేస్తోందా..? అసలు కథేంటి.. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోడీ సర్కార్ 100 రోజుల పాలన ఎలా ఉన్నా… పార్లమెంటరీ […]

విజయసాయిరెడ్డి ఎంపికకు కారణమేంటి..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 14, 2019 | 3:35 PM

పార్లమెంటరీ స్థాయి సంఘాలను స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించారు. అసలు విజయసాయిరెడ్డికి కీలక పదవి ఇవ్వడానికి కారణమేంటి..? టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కూడా ఇంకా ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నారు అయినప్పటికీ విజయసాయిరెడ్డినే ఎందుకు నియమించాల్సి వచ్చింది..? బీజేపీ చెప్పినట్లే వైసీపీ చేస్తోందా..? అసలు కథేంటి..

రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోడీ సర్కార్ 100 రోజుల పాలన ఎలా ఉన్నా… పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను వెయ్యడం ద్వారా… శాఖల వారీగా మరింత జోరుగా పరిపాలన సాగించేందుకు కేంద్రం సిద్ధమైంది. అన్ని పార్టీల ఎంపీలనూ పరిపాలనలో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తూ… స్టాండింగ్ కమిటీల్లో వివిధ పార్టీల ఎంపీలకు బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా చేర్చింది.

వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి కమిటీ సంఘం చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమించగా.. కేశినేని నాని, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నామాలను ఈ కమిటీలో సభ్యులుగా చేర్చినట్లు ఓం బిర్లా తెలిపారు. ఇక పరిశ్రమల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎంపీ కేశవరావును నియమించారు. ఈ కమిటీలో సభ్యుడిగా అవినాష్ రెడ్డిని నియమించారు. ఇక రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్థాయి సంఘం చైర్మన్‌గా టీజీ వెంకటేష్, పార్లమెంట్ వ్యవహారాల ఆర్థికశాఖ సభ్యులుగా మిథున్‌రెడ్డి, సీఎం రమేష్‌ను నియమిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.

అంతేకాదు గతంలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి బిల్లులకు ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా వైసీపీ సర్కార్ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతుతో ఏపీలో బీజేపీ హవా కొనసాగించే ప్రయత్నం చేయబోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇక ఏపీలో కూడా బీజేపీ పాగా వేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

అయితే విజయసాయి రెడ్డి కంటే.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కూడా సీనియర్ నేతలు ఉన్నారు. వారిని పక్కన పెట్టి విజయసాయిరెడ్డిని ఎంపిక చేయడం పై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడూ ప్రతిపక్షాలపై ట్వీట్లు మాత్రమే చేస్తూ ఉండే విజయసాయిరెడ్డి.. ఈ పదవికి సరైన న్యాయం చేస్తారా..? లేక బీజేపీ చెప్పినట్లు నడుచుకుంటారా.? గతంలో కూడా బీజేపీ, వైసీపీ పార్టీల మధ్య స్నేహబంధం కుదిర్చేందుకు విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డికి ఈ పదవి అప్పగించారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ