Realme 8 Series Launch Event LIVE: మరికాసేపట్లో లాంచ్‌ కానున్న రియల్‌మీ కొత్త ప్రొడక్ట్స్‌.. లైవ్‌ వీడియో ఇలా చూడండి.

Realme 8i, Realme 8s, Realme Pad Launch LIVE Updates: రోజుకో కొత్త గ్యాడ్జెట్‌ను మార్కెట్లోకి తీసుకొస్తూ దూసుకుపోతోంది చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రియల్‌మీ. ఇప్పటి వరకు మొబైల్‌ ఫోన్లకు...

Realme 8 Series Launch Event LIVE: మరికాసేపట్లో లాంచ్‌ కానున్న రియల్‌మీ కొత్త ప్రొడక్ట్స్‌.. లైవ్‌ వీడియో ఇలా చూడండి.
Follow us

|

Updated on: Sep 09, 2021 | 12:27 PM

Realme 8i, Realme 8s, Realme Pad Launch LIVE Updates: రోజుకో కొత్త గ్యాడ్జెట్‌ను మార్కెట్లోకి తీసుకొస్తూ దూసుకుపోతోంది చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రియల్‌మీ. ఇప్పటి వరకు మొబైల్‌ ఫోన్లకు పరిమితమైన రియల్‌మీ తాజాగా.. రియల్‌మీ ప్యాడ్ పేరుతో తొలి ట్యాబ్‌ను లాంచ్‌ చేయనుంది. వీటితో మరో రెండు కొత్త స్మార్ట్‌ ఫోన్‌లను సైతం రియల్‌మీ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు రియల్‌మీ ఈ కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్‌ చేస్తోంది. రియల్‌ లాంచ్‌ ఈవెంట్‌ లైవ్‌ వీడియోను ఎలా చూడాలి.? ఈరోజు విడుదల చేయనున్న గ్యాడ్జెట్ల ఫీచర్లు ఎలా ఉండనున్నాయన్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రియల్‌మీ 8ఐ:

రియల్‌మీ తీసుకొస్తున్న ఈ కొత్త ఫోన్‌లో 6.6 అంగుళాల 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఉన్న డిస్‌ప్లేను అందిస్తోంది. 6 జీబీ ర్యామ్‌తో రానున్న ఈ ఫోన్‌లో మీడియా టెక్‌ హీలియో జీ96 ప్రాసెసర్‌ను అందించారు. మరో 5జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకునే అవకాశం కల్పించారు. కెమెరా విషయానికొస్తే 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు 16 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు.

రియల్‌మీ 8ఎస్‌:

రియల్‌మీ ఈరోజు విడుదల చేయనున్న మరో స్మార్ట్‌ ఫోన్‌ రియల్‌మీ 8ఎస్‌. మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 చిప్‌మెట్‌తో వస్తోన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే కావడం విశేషం. ఇందులో 8 జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. 8.8 ఎమ్‌ఎమ్‌ మందంతో ఉన్న ఈ ఫోన్‌ బరువు కేవలం 191 గ్రాములు మాత్రమే. కెమెరా విషయానికొస్తే 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు.

రియల్‌మీ ప్యాడ్:

రియల్‌మీ తొలిసారి తన బ్రాండ్‌ నుంచి ట్యాబ్‌ను విడుదల చేస్తోంది. ఇందులో 10.4 అంగుళాల WUXGA+ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. కేవలం 6.9 ఎమ్‌ఎమ్‌ మందంతో అత్యంత సన్నగా దీనిని డిజైన్‌ చేయడం మరో ప్రత్యేకత. ఈ ట్యాబ్‌ను గోల్డ్‌, గ్రే కలర్‌లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

లైవ్‌ వీడియోను ఇక్కడ చూడండి..

Also Read: Bank Robbery: మిడ్‌నైట్‌లో బ్యాంక్ చోరీకి ప్లాన్.. విఫలమైన భార్యా భర్తలు.. అసలేం జరిగిందంటే..

Viral Video: స్వచ్ఛమైన ప్రేమంటే ఇదే.. మనసులు దోచుకుంటున్న ట్రాన్స్‌జెండర్ నగల ప్రకటన.. వీడియో వైరల్

Telangana High Court: ఆ వినాయకులకు అక్కడ అనుమతి లేదు.. గణేశ్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు..