“ఆకాశ దీపం’ అసలు రహస్యం ఇదే !

శివ కేశవులకు ఎంతో ప్రియమైనది కార్తీక మాసం. అంతేకాదు..ఋషులకు, పితృదేవతలకు, పితృపతి యమ ధర్మరాజునకూ ప్రియమైన మాసము. ఈ పవిత్రమాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్థంభానికి “ఆకాశ దీపాన్ని’ వెళ్లాడ దీస్తారు. చిన్న చిన్న రంద్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో […]

ఆకాశ దీపం' అసలు రహస్యం ఇదే !
Pardhasaradhi Peri

|

Nov 05, 2019 | 7:30 PM

శివ కేశవులకు ఎంతో ప్రియమైనది కార్తీక మాసం. అంతేకాదు..ఋషులకు, పితృదేవతలకు, పితృపతి యమ ధర్మరాజునకూ ప్రియమైన మాసము. ఈ పవిత్రమాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్థంభానికి “ఆకాశ దీపాన్ని’ వెళ్లాడ దీస్తారు. చిన్న చిన్న రంద్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెలుతుంటారు. ఈ ఆకాశదీపాన్నే..యమ దీపమని కూడ వ్యవహరిస్తారు. అయితే సామాన్యంగా దీపం వెలిగించి దేవతలను, ఋషులను ఆహ్వానిస్తాం. కానీ, ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం వుంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, ఆకాశదీపారాధన చేసి యమ ధర్మరాజును తమ వైపు రావద్దు అని సూచిస్తున్నట్లుగా వేధాల సారాంశం. అప్పుడు ఆకాశ దీపాన్నిచూచి యముడు తిరిగి తనలోకానికి వెళతాడని ఆకాశ దీపం కనపడని ఊరికి, ఇంటికి వస్తాడని పురాణ వచనం. మోక్షం కోరినా, కోరకున్నా యముడు రావద్దని అందరూ అనుకుంటారు. కావున ప్రతి ఒక్కరూ ఆకాశదీపాన్ని ఈ కార్తిక మాసములో వెలిగించి ఇష్టదైవాన్ని, పితృ దేవతలను ఆహ్వానించి పితృపతిని మాత్రం ఆశీస్సులు అందజేయమని మాత్రమే కోరతారు.. ఆకాశ దీపం ఉన్న ఇంటికి లక్ష్మీ నారాయణులు వస్తారని లేని ఇంటికి యమధర్మరాజు వస్తాడని స్కాందపురాణ వాక్యం. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారని పురాణ కథనం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu