వార్ కి రెడీగా ఉండండి, సేనలకు చైనా అధ్యక్షుని పిలుపు

అనుకున్నంతా అయింది. చైనా ఏకంగా యుధ్ధాన్ని ప్రకటించింది. లడాఖ్ లో భారత,చైనా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ సమర శంఖమూదారు. మంగళవారం గ్యాంగ్ డాంగ్ లోని మిలిటరీ బేస్ ను సందర్శించిన ఆయన.. యుధ్ధానికి సిద్ధంగా ఉండాల్సిదిగా పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీకి సూచించారు. అయితే అది ఇండియా మీదా కాదా అన్నది స్పష్టం కాలేదు. మన దేశానికి విధేయులుగా ఉండాలని, వార్ మీదే మీ శక్తిని, మనసును […]

వార్ కి రెడీగా ఉండండి, సేనలకు చైనా అధ్యక్షుని పిలుపు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 14, 2020 | 8:03 PM

అనుకున్నంతా అయింది. చైనా ఏకంగా యుధ్ధాన్ని ప్రకటించింది. లడాఖ్ లో భారత,చైనా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ సమర శంఖమూదారు. మంగళవారం గ్యాంగ్ డాంగ్ లోని మిలిటరీ బేస్ ను సందర్శించిన ఆయన.. యుధ్ధానికి సిద్ధంగా ఉండాల్సిదిగా పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీకి సూచించారు. అయితే అది ఇండియా మీదా కాదా అన్నది స్పష్టం కాలేదు. మన దేశానికి విధేయులుగా ఉండాలని, వార్ మీదే మీ శక్తిని, మనసును కేంద్రీకరించాలని అన్నారు. అయితే ఈ పిలుపు ఇండియాను ఉద్దేశించా లేక అమెరికా మీదా లేక సౌత్ చైనా సీ లో తనకు ప్రత్యర్థులుగా ఉన్న దేశాలమీదా అన్నది తెలియలేదు. హై అలెర్ట్ గా ఉండాలని, విశ్వసనీయులుగా ఉండాలని కూడా జీ జిన్ పింగ్ కోరారు. నిన్న భారత చైనా దేశాల మధ్య ఏడో దఫా కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. అయితే జీ గారి పిలుపుపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.

పోరాట పటిమను పెంచుకోవాలని, ఫీల్డ్ లో బహుళ సామర్థ్యంతో, ‘రాపిడ్ రెస్పాన్స్’ తో వ్యవహరించాలని, పార్టీకి, మిలిటరీకి ‘నిష్కల్మషమైన’ విధేయులుగా ఉండాలంటూ జీ జిన్ పింగ్ పేర్కొన్నట్టు సిన్ హువా వార్తా సంస్థ తెలిపింది.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 13 న లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్ లలో బ్రిడ్జీలను లాంచ్ చేశారు. దీనిపై చైనా ఇండియాను టార్గెట్ చేసింది. లడాఖ్ కేంద్రపాలితప్రాంతాన్ని, అరుణాచల్ ప్రదేశ్ ని తాము గుర్తించబోమని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. లడాఖ్ యూనియన్ టెరిటరీని భారత్ అక్రమంగా ‘ఏర్పాటు చేసింది’ పైగా సరిహద్దుల్లో తన సేనలను మోహరిస్తోంది అని దుయ్యబట్టింది. ఇండో-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగడానికి ఇండియాయే కారణమని కూడా విమర్శించింది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు