మోదీ ప్రభుత్వానికి ఊతం.. ఆర్బీఐ 1.76లక్షల కోట్ల నిధుల సాయం

మోదీ ప్రభుత్వానికి ఊతం.. ఆర్బీఐ 1.76లక్షల కోట్ల నిధుల సాయం

ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగులు రూ.1.76 లక్షల కోట్ల నిల్వల్ని కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్సుఫర్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం నిర్ణయించింది. మిగులును తమకు ఇవ్వాలని కేంద్రం ఎన్నాళ్ల నుంచో కోరుతోంది. ఈ క్రమంలో ఆర్బీఐ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిమల్‌జలాన్‌ కమిటీ ప్రతిపాదనకు ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ‘‘ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు రూ.1,76,051 కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 2018-19 ఆర్థిక […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 27, 2019 | 10:35 AM

ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగులు రూ.1.76 లక్షల కోట్ల నిల్వల్ని కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్సుఫర్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం నిర్ణయించింది. మిగులును తమకు ఇవ్వాలని కేంద్రం ఎన్నాళ్ల నుంచో కోరుతోంది. ఈ క్రమంలో ఆర్బీఐ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిమల్‌జలాన్‌ కమిటీ ప్రతిపాదనకు ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ‘‘ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు రూ.1,76,051 కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.1,23,414 మిగులు నిధులతో పాటు ఎకనామిక్‌ కేపిటల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఈసీఎఫ్‌) కింద మరో రూ.52,637కోట్లను ఇచ్చేందుకు సెంట్రల్‌ బోర్డు ఇవాళ ఆమోదం తెలిపింది’’ అని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. మిగుల నిధులకు సంబంధించి బిమల్‌ జలాన్‌ కమిటీ శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్‌కు నివేదిక సమర్పించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu