కనీస డిగ్రీతో ఆర్బీఐ ఉద్యోగం.. దరఖాస్తు చేసుకోండిలా..!

న్యూ ఇయర్ వేళ నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. కనీస డిగ్రీ అర్హత ఉంటే చాలు దేశంలోనే అత్యున్నత బ్యాంకు ఆర్బీఐలో అసిస్టెంట్ పోస్టు సాధించే సువర్ణావకాశం మీ సొంతమవుతుంది. బ్యాంకు లావాదేవీలను పరిశీలించడమే ఈ అసిస్టెంట్ల ప్రధాన విధి, వారానికి ఐదు రోజులు పని, అంతేకాకుండా పనివేళలు చాలా తక్కువ.. నెలకు రూ.36,000 వేతనం. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం ఈ పోస్టుకు కావలసిన అర్హతలు, పరీక్ష విధివిధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా […]

  • Ravi Kiran
  • Publish Date - 4:12 pm, Tue, 31 December 19
కనీస డిగ్రీతో ఆర్బీఐ ఉద్యోగం.. దరఖాస్తు చేసుకోండిలా..!

న్యూ ఇయర్ వేళ నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. కనీస డిగ్రీ అర్హత ఉంటే చాలు దేశంలోనే అత్యున్నత బ్యాంకు ఆర్బీఐలో అసిస్టెంట్ పోస్టు సాధించే సువర్ణావకాశం మీ సొంతమవుతుంది. బ్యాంకు లావాదేవీలను పరిశీలించడమే ఈ అసిస్టెంట్ల ప్రధాన విధి, వారానికి ఐదు రోజులు పని, అంతేకాకుండా పనివేళలు చాలా తక్కువ.. నెలకు రూ.36,000 వేతనం. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం ఈ పోస్టుకు కావలసిన అర్హతలు, పరీక్ష విధివిధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ముందుగా ప్రాథమిక పరీక్ష.. ఆ తర్వాత ప్రధాన పరీక్ష ఉంటాయి. ఇక ఈ రెండు దశలూ దాటితే లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. అయితే ఉద్యోగానికి మాత్రం అర్హత సాధించాలంటే ప్రధాన పరీక్షలో అత్యధిక స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఇక ఈ పరీక్షలు ఎన్ని మార్కులకు ఉంటాయో తెలుసుకుందాం.

ప్రాథమిక పరీక్ష…

– ఈ పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. అంతేకాకుండా మూడు విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి.

ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 30 మార్కులు

న్యూమరికల్ ఎబిలిటీ- 35 మార్కులు

రీజనింగ్ ఎబిలిటీ- 35 మార్కులు

ఇక పరీక్ష వ్యవధి ఒక గంటగా నిర్దేశించారు.

ప్రధాన పరీక్ష…

– ఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.

ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 40 మార్కులు

న్యూమరికల్ ఎబిలిటీ- 40 మార్కులు

రీజనింగ్ ఎబిలిటీ- 40 మార్కులు

జనరల్ అవేర్‌నెస్ – 40 మార్కులు

కంప్యూటర్ నాలెడ్జ్ – 40 మార్కులు

పరీక్ష వ్యవధి 135 మినిట్స్.

ఇదిలా ఉంటే ఈ రెండు పరీక్షల్లోనూ తప్పులు రాస్తే మైనస్ మార్కులు ఉంటాయి. ప్రతీ తప్పుకు 1/2 మార్క్ పోతుంది. కాగా, ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటాయి.

లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్…

పైరెండు పరీక్షల్లో అర్హత సాధించినవారికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇక అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న కార్యాలయానికి కేటాయించిన భాషలో ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో 25 ఖాళీలకు తెలుగు భాషలో పరీక్ష రాసే అవకాశం ఉండగా.. ముంబైలో 419 ఖాళీల కోసం మరాఠీ లేదా కొంకిణీ భాషా తెలుసుండాలి.

కావలసిన అర్హతలు లిస్ట్ ఇదే…

విద్యార్హత: 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయితే డిగ్రీ పూర్తి చేస్తే చాలు..

వయసు: డిసెంబరు 1, 2019 నాటికి 20- 28 ఏళ్ల మధ్య ఉండాలి

ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపులు వర్తిస్తాయి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 16

అప్లికేషన్ ఫీ: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మన్‌కు రూ.50, మిగిలిన వారికి రూ.450

ప్రిలిమినరీ పరీక్షలు: ఫిబ్రవరి 14,15

పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, చీరాల, విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌

ప్రధాన పరీక్షలు: మార్చిలో

సమాచారం కోసం:  www.rbi.org.in