Ravi Shastri Birthday: పాక్‌ క్రికెటర్‌ని షూతో కొట్టడానికి వెళ్లిన రవిశాస్త్రి.. ఎప్పుడు జరిగిందంటే..?

Ravi Shastri Birthday: ఇండియన్‌ క్రికెట్‌లో రవిశాస్త్రికి ప్రత్యేకమైన శైలి ఉంది. ఈ రోజు (మే 27న) అతడి పుట్టినరోజు. మాజీ క్రికెటర్‌గా, డైరెక్టర్‌గా, టీమిండియా ప్రధాన కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి ఈరోజు 60వ ఏట అడుగుపెడుతున్నాడు.

Ravi Shastri Birthday: పాక్‌ క్రికెటర్‌ని షూతో కొట్టడానికి వెళ్లిన రవిశాస్త్రి.. ఎప్పుడు జరిగిందంటే..?
Ravi Shastri
Follow us

|

Updated on: May 27, 2022 | 12:27 PM

Ravi Shastri Birthday: ఇండియన్‌ క్రికెట్‌లో రవిశాస్త్రికి ప్రత్యేకమైన శైలి ఉంది. ఈ రోజు (మే 27న) అతడి పుట్టినరోజు. మాజీ క్రికెటర్‌గా, డైరెక్టర్‌గా, టీమిండియా ప్రధాన కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి ఈరోజు 60వ ఏట అడుగుపెడుతున్నాడు. అతడి జీవితంలో క్రికెట్‌తో ముడిపడిన చాలా సంఘటనలు ఉన్నాయి. గత సంవత్సరం అతను ‘స్టార్‌గేజింగ్’ పుస్తక ఆవిష్కరించిన సందర్భంగా అనేక సంఘటనలను ప్రస్తావించాడు. ఒక పాకిస్తానీ ఆటగాడిని షూతో కొట్టడానికి వెళ్లిన సంఘటన గురించి కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నాడు. ఈ సంఘటన 1987లో జరిగింది. ఆ సమయంలో ఇండియాలో భారత, పాక్‌ మధ్య వన్డే సిరీస్‌ జరుగుతోంది. అందులో భాగంగా మూడో వన్డేలో పాకిస్థాన్‌ను భారత్ ఓడించింది. కానీ ఆ తర్వాత జావేద్ మియాందాద్ చేసిన పని రవిశాస్త్రికి చాలా కోపాన్ని తెప్పించింది.

హైదరాబాద్‌లో జరిగిన మూడో వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 212 పరుగులు చేసింది. భారత్ తరఫున రవిశాస్త్రి అత్యధికంగా 69 పరుగులు చేశాడు. మరోవైపు కపిల్ దేవ్ 59 పరుగులు చేశాడు. 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన పాక్ జట్టు విజయానికి చేరువైనప్పటికీ గెలుపు సాధించలేకపోయింది. చివరి బంతికి 2 పరుగులు అవసరం. అబ్దుల్‌ ఖాదిర్‌ మొదటి పరుగు తీశాడు కానీ రెండో పరుగు సాధించడంలో విఫలమయ్యాడు. రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఇరు జట్లకు స్కోరు సమమైంది. అయితే పాక్‌ కంటే భారత్‌ ఒక వికెట్‌ తక్కువగా కోల్పోయినందున ఇండియా గెలిచినట్లు ప్రకటించారు.

ఈ ఓటమిని పాకిస్థాన్ సహించలేదు. పాకిస్థాన్ ఆటగాడు జావేద్ మియాందాద్.. టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి ‘మీరు మోసం చేసి గెలుస్తారు’ అన్నాడు. దీంతో రవిశాస్త్రకి పట్టరాని కోపం వచ్చి మియాందాద్‌ని షూతో కొట్టడానికి పరుగెత్తుతాడు. పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ వరకు అతడి వెంట పరుగెత్తుతాడు. ఇంతలో పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ జోక్యం చేసుకొని గొడవ సద్దుమణిగేలా చేస్తాడు. అయితే ఈ సంఘటన గురించి ఈ ఇద్దరు ఆటగాళ్లు బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతారు. దీంతో ఇది ఎవ్వరికి తెలియకుండా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.