దిశ రేపిస్టులకు ‘అది‘ జరగాల్సిందే… ‘లలిత’ కిరణ్ ఏమన్నారంటే?

దేశవ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన దిశ అత్యాచారం, దారుణ హత్యోదంతంపై లలిత జెవెల్లరీస్ కిరణ్ తనదైన శైలిలో ఉద్వేగంతో స్పందించారు. దిశ అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించిన కిరణ్.. ఇటువంటి ఉదంతాలు జరగడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మరో అడుగు ముందుకేసి ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు. టీవీ9 ఛానల్‌తో కిరణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. సమాజంలో మనుషులు రూపంలో తిరిగే నరరూప రాక్షసులున్నారని, వారి నుంచి మన ఆడపిల్లలను మనమే రక్షించుకోవాల్సి వుందని కిరణ్ వ్యాఖ్యానించారు. ఎవరో వస్తారని, ఏదో […]

  • Rajesh Sharma
  • Publish Date - 1:21 pm, Tue, 3 December 19
దిశ రేపిస్టులకు ‘అది‘ జరగాల్సిందే... ‘లలిత’ కిరణ్ ఏమన్నారంటే?

దేశవ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన దిశ అత్యాచారం, దారుణ హత్యోదంతంపై లలిత జెవెల్లరీస్ కిరణ్ తనదైన శైలిలో ఉద్వేగంతో స్పందించారు. దిశ అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించిన కిరణ్.. ఇటువంటి ఉదంతాలు జరగడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మరో అడుగు ముందుకేసి ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు. టీవీ9 ఛానల్‌తో కిరణ్ ప్రత్యేకంగా మాట్లాడారు.

సమాజంలో మనుషులు రూపంలో తిరిగే నరరూప రాక్షసులున్నారని, వారి నుంచి మన ఆడపిల్లలను మనమే రక్షించుకోవాల్సి వుందని కిరణ్ వ్యాఖ్యానించారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడడం కన్నా.. మన పిల్లలకు వారిని వారు రక్షించుకునే విధానాలను చిన్నప్పట్నించే నేర్పించాల్సి వుందని అన్నారు కిరణ్.

ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న రాక్షసులకు 24 గంటలలో ఉరిశిక్ష పడేలా చట్టాలు మార్చాలని కిరణ్ సూచిస్తున్నారు. సమాజంలో మనుషుల రూపం లో కొంతమంది మృగాళ్లు ఉన్నారు, వాళ్ళ నుండి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారాయన. ఆడపిల్లలకు ఉన్నత మైన విద్యతో పాటు ఆత్మరక్షణ కి సంబంధించిన టెక్నిక్స్ నేర్పించాలని, తల్లితండ్రులతో పాటు ప్రభుత్వాలు కూడా గ్రామాల నుండి సిటీ వరకు ఉన్న అన్ని పాఠశాలలలో రోజు ఒక గంట పాటు ఆత్మరక్షణకి సంబంధించి క్లాసులు నిర్వహించాలని ఆయనంటున్నారు. ఇటువంటి ఘటనలు జరిగేప్పుడు… వాటిని ప్రతిఘటించేలా మన పిల్లల్ని మనమే తయారుచేయడం తల్లితండ్రులుగా మన బాధ్యత అని చెబుతున్నారు కిరణ్.