ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం… దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటున్న రానా దగ్గుబాటి…

రానా జన్మదినం సందర్భంగా విరాటపర్వం చిత్ర యూనిట్ రానా లుక్ పోస్టర్‌ను, నిమిషం వ్యవధితో కూడిన వీడియోను విడుదల చేసింది.

  • Tv9 Telugu
  • Publish Date - 12:15 pm, Mon, 14 December 20
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం... దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటున్న రానా దగ్గుబాటి...

రానా జన్మదినం సందర్భంగా విరాటపర్వం చిత్ర యూనిట్ రానా లుక్ పోస్టర్‌ను, నిమిషం వ్యవధితో కూడిన వీడియోను విడుదల చేసింది. అందులో ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది… సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది…. అతడే డాక్టర్ రవి శంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న అంటూ రానా ను పరిచయం చేశారు. వీడియో చివరిలో ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం… దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటున్న రానా దగ్గుబాటి నినదించారు. ఈ చిత్రాన్ని 1990లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీస్తున్నారు. కాగా ‌రానా ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా విరాటపర్వం. డి సురేష్ బాబు సమర్పణంలో చెరుకూరి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

పుట్టిన రోజు శుభాకాంక్షల వెలువ….

రానా ఇంటి సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఆయన జన్మదిన సందర్భంగా ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. దానిలో రానా కుటుంబసభ్యులతో దిగిన అరుదైన చిత్రాలను ప్రదర్శించింది. రానా నటించిన సినిమాల్లోని ప్రత్యేక సంభాషణలు, రానా గెటప్‌లను ప్రత్యేకంగా చూపించింది. మీలో లీడర్‌ను చూస్తున్నాను సర్ అని తనికెళ్ల భరణి లీడర్ సినిమాలోని డైలాగ్‌తో వీడియో ప్రారంభమైంది. క‌ృష్ణం వందే జగద్గురు సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్ తో వీడియో ఎండ్ అయ్యింది.

సినీ కుటుంబం నుంచి….

తెలుగు సినీ హీరోలు మెగా‌స్టార్ చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, నాని, రామ్, శ్రీ విష్ణు, మెగా బ్రదర్ నాగబాబు, దర్శకులు సురేందర్ రెడ్డి, బాహుబలి టీం, నిర్మాత శోభు యార్లగడ్డ, పరుచూరి గోపాల క్రిష్ణ, కమెడియన్స్ రఘు, రచ్చ రవి, పలు చిత్ర నిర్మాణ సంస్థలు, పలువురు రాజకీయ నాయకులు, సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ సైతం రానా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.