Ram ‘Red’ Movie : బాక్సాఫీస్ దగ్గర కలక్షన్ల వర్షం కురిపిస్తున్న రామ్ ‘రెడ్’.. ఏమాత్రం తగ్గని జోరు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'రెడ్ మూవీ' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 14 న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.

  • Rajeev Rayala
  • Publish Date - 5:46 am, Wed, 20 January 21
Ram 'Red' Movie : బాక్సాఫీస్ దగ్గర కలక్షన్ల వర్షం కురిపిస్తున్న రామ్ 'రెడ్'.. ఏమాత్రం తగ్గని జోరు

Ram ‘Red’ Movie :  ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘రెడ్ మూవీ’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 14 న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. మొదటి రోజే దాదాపు 5 కోట్లు రాబట్టి రామ్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇక నాలుగు రోజుల్లో 22.70 కోట్ల గ్రాస్ రాబట్టిందని.. ఐదో రోజు 1.16 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్స్ చెప్తున్నాయి. నాలుగు రోజులు కలిపి వరల్డ్ వైడ్ గా 22.70 కోట్ల గ్రాస్.. 13.59 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే  ఐదవ రోజు మొత్తం 1.16 కోట్ల షేర్ ని రాబట్టింది ఈ సినిమా.   మొత్తంగా చూసుకుంటే రామ్ ‘రెడ్’ సినిమా ఐదు రోజుల్లో 14.75 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. వీటిలో నైజాం- 4.90 కోట్లు.. సీడెడ్- 2.45 కోట్లు.. ఆంధ్రా – 5.75 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది.