అయోధ్యలో రామాలయ నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళాలు అందాయి, రామజన్మ భూమి ట్రస్టు కార్యదర్శి వెల్లడి

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళాలు అందాయి, రామజన్మ భూమి ట్రస్టు కార్యదర్శి వెల్లడి

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 100 కోట్ల విరాళాలు అందాయని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపక్ రాయ్ తెలిపారు.  తమ కార్యాలయానికి ఇంతవరకు డేటా అందలేదని..

Umakanth Rao

| Edited By: Ram Naramaneni

Jan 18, 2021 | 7:52 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 100 కోట్ల విరాళాలు అందాయని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపక్ రాయ్ తెలిపారు.  తమ కార్యాలయానికి ఇంతవరకు డేటా అందలేదని, కానీ తమ కార్యకర్తల నుంచి ఈ మేరకు రిపోర్టు అందిందని ఆయన చెప్పారు. ఈ మహత్తర కార్యక్రమానికి ఇంత మేర సొమ్ము అందిందని పేర్కొన్నారని చెప్పిన ఆయన.., వారు దేశంలోని అన్ని జిల్లాలను విరాళాల కోసం సందర్శిస్తున్నారని వెల్లడించారు. ఈ నెల 15 నుంచి తమ ట్రస్ట్ విరాళాలు సేకరించడం ప్రారంభించిందని, ఇది ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. దేశంలో ఎవరైనా, ఏ మతం వారైనా డొనేషన్లు ఇవ్వవచ్ఛునని చంపక్ రాయ్ పేర్కొన్నారు. సుమారు 39 నెలల్లో..బహుశా 2024 నాటికి రామాలయ నిర్మాణం పూర్తి కావచ్చు అన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ఆలయ నిర్మాణానికి రూ. 5 లక్షలకు పైగా డొనేషన్ అందజేశారు. తనను రాష్ట్రపతి భవన్ లో కలిసిన ట్రస్ట్ ప్రతినిధి బృందానికి ఆయన ఈ మేరకు చెక్కు అందించారు.

ఇలా ఉండగా రామాలయ మందిరానికి 25 కి.మీ. దూరంలో మసీదు నిర్మాణానికి ముస్లిం సంస్థలు సన్నాహాలు ప్రారంభించాయి. ఇందుకు డిజైన్ ని ఓ కమిటీ ఆమోదించింది.

Also Read: Indian Oil tatkal facility: తత్కాల్ సిలిండర్ సౌకర్యం.. బుక్ చేసిన గంటల్లో సిలిండర్ హోమ్ డెలివరీ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu