Corona 3rd Wave: థర్డ్ వేవ్‌పై కెమిక‌ల్ ఇంజ‌నీర్ మ‌ల్లిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అత‌డి అనాలిసిస్‌పై ఆర్జీవీ ఏమ‌న్నారంటే

కరోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం ఇంకా త‌గ్గ‌లేదు. అప్పుడే థర్డ్ వేవ్ పై వైద్య నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్రముఖ కెమికల్ ఇంజనీర్ పరుచూరి మల్లిక్...

Corona 3rd Wave: థర్డ్ వేవ్‌పై కెమిక‌ల్ ఇంజ‌నీర్ మ‌ల్లిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అత‌డి అనాలిసిస్‌పై ఆర్జీవీ ఏమ‌న్నారంటే
Paruchuri Mallik
Follow us

|

Updated on: Jun 13, 2021 | 3:08 PM

కరోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం ఇంకా త‌గ్గ‌లేదు. అప్పుడే థర్డ్ వేవ్ పై వైద్య నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్రముఖ కెమికల్ ఇంజనీర్ పరుచూరి మల్లిక్ చెబుతున్న విష‌యాలు ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌ను రేకెత్తిస్తున్నాయి. థర్డ్ వేవ్ భయంకరంగా ఉండ‌బోతుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో ఆ ఊర్లో కరోనా ఉంది ఈ ఊర్లో ఉంది అని విన్నాం..సెకండ్ వేవ్ లో ఆ వీధిలో చనిపోయారు ఈ వీధిలో చనిపోయారు అని మాట్లాడుకున్నాం.. ఇక‌ థర్డ్ వేవ్ మన ఇళ్లలోకి రాబోతుంద‌ని ఆయ‌న బాంబ్ పేల్చారు. ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్న కరోనా వేరియంట్ పై ఎలాంటి వాక్సిన్ లు పనిచేయడం లేదని మల్లిక్ అన్నారు. అలాంటి వేరియంట్ భార‌త్‌లో ఉన్న వేరియంట్ తో మిక్స్ అయితే ఆ పరిస్థితులు ప్రళయాన్ని త‌ల‌పిస్తాయ‌ని చెబుతున్నారు. కరోనా వచ్చింది అని తెలుసుకునేలోపే పేషంట్ వెంటిలేటర్ పై ఉండాల్సి ఉంటుందంటూ తన వ్యాఖ్య‌ల‌తో జ‌నాల్లో టెన్ష‌న్ పెంచారు. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని కూడా మల్లిక్ తప్పుబట్టారు. అప్పుడే అన్ లాక్‌లు మొద‌లెట్టార‌ని.. ఎవ‌రి కోసం అన్ లాక్స్ ? వేల కోట్ల రూపాయలు పనికిరాని వ్యాక్సిన్స్ పై ఖర్చుచేయడం మానాలంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ముందు ప్రతి మండలంలో ఆక్సిజన్ ప్లాంట్స్, వెంటిలేటర్స్ ఏర్పాటు చేయాలంటూ ప్ర‌భుత్వాల‌కు సూచిస్తున్నారు. కేవలం నెల, రెండు నెలల వ్యవధిలో థర్డ్ వేవ్ దేశంపై దండెత్త‌బోతుంద‌ని మల్లిక్ హెచ్చరించారు.

కాగా మ‌ల్లిక్ హెచ్చ‌రిక‌ల‌పై ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న మార్క్ అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. పరుచూరి మల్లిక్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతున్నార‌న్న వ్యాఖ్య‌ల‌ను తాను ఖండింస్తున్నాన‌ని చెప్పారు. జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య ఉన్న‌ప్పుడు జ‌నాల్లో భయం ఉంచడం అవసమ‌ని, అప్పుడు వారు జాగ్రత్త‌గా ఉంటార‌ని పేర్కొన్నారు. మ‌ల్లిక్ ప్ర‌మాదం ఉండ‌బోతుంద‌ని స్ప‌ష్టంగా చెబుతున్నాడ‌ని.. కానీ అత‌న్ని వ్య‌తిరేకిస్తున్న‌వారిలో స్ప‌ష్ట‌త లోపించింద‌ని ఆర్జీవీ అన్నారు. మ‌ల్లిక్ చెబుతున్న అంశాల‌పై ప్ర‌జ‌లు వివ‌రణ తీసుకునేందుకు ప్ర‌భుత్వం ఎందుకు ఒక ప్ర‌తినిధిని నియ‌మించ‌లేని ఆర్జీవీ ప్ర‌శ్నించారు. మ‌ల్లిక్ వ్యాఖ్య‌ల‌పై టీవీ డిబేట్లో ఓ రెచ్చిపోతున్నార‌ని.. వాటి వ‌ల్ల జనాల్లో ఎటువంటి అవ‌గాహ‌న రావ‌డంలేద‌ని చెప్పారు. సున్నా వైద్య నైపుణ్యం ఉన్న సామాన్యుడిగా త‌న‌కు మ‌ల్లిక్, మిగతా వైద్య నిపుణులందరితో పోల్చితే ఎక్కువ జ్ఞానం, సామ‌ర్థ్యం ఉన్న వ్య‌క్తిగా క‌నిపిస్తున్నాడ‌ని ఆర్జీవీ చెప్పారు. మ‌ల్లిక్ అంచ‌నాలు త‌ప్పు అని నిరూపించేందుకు వెంట‌నే ప్ర‌తినిధిని నియ‌మించాల‌ని, లేని ప‌క్షంలో అత‌డినే ప్ర‌భుత్వం కోవిడ్ విభాగానికి హెడ్‌గా నియ‌మించాల‌ని రామ్ గోపాల్ వ‌ర్మ త‌న మార్క్ కామెంట్ విసిరారు.

Also Read: భ‌ర్తతో గొడ‌వ‌పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య‌.. ఆమె పెట్టె చెక్ చేసి అత‌డు కంగుతిన్నాడు

యువతి ఆత్మహత్య.. రేపిస్టుని పట్టించిన వీర్యకణాలు