సూపర్‌స్టార్‌ వస్తారా..? రారా..? తమిళనాడులో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్..

గంటన్నరపాటు మక్కల్‌ మండల్‌ సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. అభిమానుల సలహాల కోసం ఈ మీటింగ్‌ నిర్వహించారు. కానీ సలహాల కంటే సూటి ప్రశ్నలతో రజనీకాంత్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పార్టీ పెడుతున్నారా..

సూపర్‌స్టార్‌ వస్తారా..? రారా..? తమిళనాడులో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్..
Follow us

|

Updated on: Nov 30, 2020 | 9:34 PM

అచ్చం ఈ సినిమాలాగే రజనీకాంత్‌ పార్టీ ఆలోచనను విరమించుకుంటారా అనే భయం ఆయన ఫ్యాన్స్‌కు కలిగింది. పార్టీకి గుడ్‌బై అనే అర్థంలో- ఆ మధ్య బయటకు వచ్చిన లెటర్‌తో ఫ్యాన్స్‌ అభిమానులు షాక్‌లో ఉన్నారు. రజనీ తన అభిమానుల సంఘం- రజనీ మక్కల్ మండ్రమ్ జిల్లా కార్యదర్శులతో సమావేశం అయ్యారు. రజనీకాంత్‌ చుట్టూ రాజకీయ భవిష్యత్తుకు ఆశలమేడలు కట్టుకున్న ఫ్యాన్స్‌ టెన్షన్‌ పడ్డారు.

గంటన్నరపాటు మక్కల్‌ మండల్‌ సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. అభిమానుల సలహాల కోసం ఈ మీటింగ్‌ నిర్వహించారు. కానీ సలహాల కంటే సూటి ప్రశ్నలతో రజనీకాంత్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పార్టీ పెడుతున్నారా లేక మరో పార్టీకి మద్దతు ఆలోచన ఉందా అని ఈటల్లాంటి ప్రశ్నలడిగారు అభిమానులు. దేవుడిలాంటి అభిమాన హీరో ఎంతకూ ఓ నిర్ణయం చెప్పకపోయేటప్పటికి ఫ్యాన్స్‌కు చిర్రెత్తింది. ఉద్వేగం పెరిగింది. పార్టీ పెడితేనే మీ బాటలో నడుస్తాం అన్నారు జిల్లా కార్యదర్శులు.

బీజేపీకి రజనీ మద్దతు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని సంఘాల ప్రతినిధులు ఆయన దృష్టికి తెచ్చారు. ఇంకోపార్టీకి మద్దతిస్తే ఓటు వేసేది లేదని అభిమాన సంఘాలు కరాఖండీగా చెప్పాయి. పార్టీ మీరు స్థాపించండి.. గెలుపు కోసం మేం పనిచేస్తాం అన్నారు ఫ్యాన్స్‌. అందరూ మూకమ్మడిగా ఎదురుదాడి చేసేటప్పటికీ తలైవా పరేషాన్‌ అయ్యారు.

నాయకులను శాసించే అధికారం ఇప్పుడు రజనీకి లేదు. వారి మాట వినడం మరో ఛాయిస్‌ లేదు. వారి మాటకు ఎదరుచెప్పే వాయిస్‌ రజనీ లేదన్నట్లు అక్కడి సీన్ కనిపించింది. గంటన్నరసేపు వాడివేడి చర్చలు జరిగాయి. రజనీ నిర్ణయం కోసం అభిమాన సంఘాల ప్రతినిధులు ఆతృతగా ఎదురుచూశారు.

కానీ అక్కడే చిన్న ట్విస్ట్‌. బాబా సినిమాలోలాగా రజనీలో మౌనమే కనిపించింది. ఎలాంటి ప్రకటన చేయకుండానే రజనీకాంత్ వెళ్లారు. నా అభిప్రాయం అభిమాన సంఘాల నేతలకు చెప్పానని ఇంటిదగ్గర మీడియా ప్రతినిధులకు  చెప్పారు. వారు కూడా వారి ఆలోచనలు ఎంతో స్పష్టంగా చెప్పారు..

నా నిర్ణయం త్వరలోనే చెబుతా అన్నారు రజనీ. ఇప్పుడు రజనీకాంత్‌ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు. రాజకీయాల్లోకి వస్తా అని చెప్పి ఆశలు రేపారు. తిప్పితిప్పికొడితే అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్లు కూడా లేదు. సూపర్‌స్టార్‌ వస్తాడా.. రాడా. అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత తలైవాదే. ఆయన రాజకీయ పార్టీ నాయకుడిలా డ్రస్‌ వేసుకుని అలా.. నడచుకుంటూ రావాలని ఫ్యాన్స్‌ కలలు గంటున్నారు. ఆ కలలు సాకారం కావాలని ఆశ పడుతున్నారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.