IPL 2020 RCB Vs RR మహిపాల్ మెరుపులు… బెంగళూరు టార్గెట్ 155

కీలక ఆటగాళ్లు విఫలమైనా... యువ ఆటగాడు మహిపాల్ మెరుపులు మెరిపించాడు. 20ఏండ్ల మహిపాల్‌ లామ్రోర్‌(47: 39 బంతుల్లో 1ఫోర్‌, 3సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది...

IPL 2020 RCB Vs RR మహిపాల్ మెరుపులు... బెంగళూరు టార్గెట్ 155
Follow us

|

Updated on: Oct 03, 2020 | 5:59 PM

కీలక ఆటగాళ్లు విఫలమైనా… యువ ఆటగాడు మహిపాల్ మెరుపులు మెరిపించాడు. 20ఏండ్ల మహిపాల్‌ లామ్రోర్‌(47: 39 బంతుల్లో 1ఫోర్‌, 3సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. మహిపాల్‌ మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్ల ధాటికి బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన స్మిత్ సేననిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ను పేలవంగా ప్రారంభించింది. కోహ్లీ సేన ధాటికి 31 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. ఇసురు ఉడానా వేసిన మూడో ఓవర్లో కెప్టెన్‌ స్మిత్(5)‌ బౌల్డయ్యాడు. నవదీప్‌ సైనీ వేసిన నాలుగో ఓవర్లో దూకుడుగా ఆడుతున్న ఓపెనర్‌ బట్లర్(22)‌..పడిక్కల్‌కు సునాయాస క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. స్పిన్నర్‌ చాహల్‌ వేసిన ఐదో ఓవర్లో హార్డ్‌హిట్టర్‌ సంజూ శాంసన్‌(4) రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. పవర్‌ప్లేలో ఆజట్టు ౩ వికెట్లకు 38 పరుగులు చేసింది.