ఈ రోజు మ్యాచ్ గెలిచేది ఎవరో తెలుసా..!

ఐపీఎల్‌-13లో వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కఠిన సవాల్‌కు రెడీ అవుతోంది. దుబాయ్‌ వేదికగా మ్యాచ్‌లో రాజస్తాన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఢీ అంటే ఢీ అననున్నాయి. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో వార్నర్‌ టీమ్...

  • Sanjay Kasula
  • Publish Date - 6:54 pm, Thu, 22 October 20
ఈ రోజు మ్యాచ్ గెలిచేది ఎవరో తెలుసా..!

RR vs SRH Prediction : ఐపీఎల్‌-13లో వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కఠిన సవాల్‌కు రెడీ అవుతోంది. దుబాయ్‌ వేదికగా మ్యాచ్‌లో రాజస్తాన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఢీ అంటే ఢీ అననున్నాయి. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో వార్నర్‌ టీమ్ అసమాన్య ప్రదర్శన చేయాల్సి సమయం వచ్చింది.

ఏడో స్థానంలో ఉన్న హైదరాబాద్‌, ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్‌ మధ్య సీరియస్ ఫైట్జ రుగనుంది. ఈ నేపథ్యంలో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్‌ వైపు అడుగెస్తే.. ఓడిన జట్టు తిరుగుముఖం పడుతుంది. దుబాయ్‌ వేదికగా హైదరాబాద్‌, రాజస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ఉత్కంఠగా జరుగనుంది.

ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 12 మ్యాచుల్లో పోటీ పడ్డాయి. అందులో ఆరేసి విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆర్ఆర్ జట్టు 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. దీనికి తోడు దుబాయ్  మైదానంలో రాజస్థాన్‌కు చెత్త రికార్డు ఉండటం పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. 5 మ్యాచులాడి నాలుగింట్లో ఓడింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఇక్కడ ఆడిన మ్యాచుల్లో హైదరాబాద్‌ జట్టు ఏడింట్లో నాలుగు మ్యాచులను గెలుచుకుంది. మూడింట్లో ఓటమిపాలైంది. ఎవరిని విజయం వరిస్తుందో వేచి చూడాలి.