Legal Age Of Smoking: పొగాకు ఉత్పత్తులపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఇకపై వారికి నో ఛాన్స్‌..

Raise Leagl Age Of Smoking: ఇప్పటి వరకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం..

Legal Age Of Smoking: పొగాకు ఉత్పత్తులపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఇకపై వారికి నో ఛాన్స్‌..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 8:08 PM

Raise Leagl Age Of Smoking: ఇప్పటి వరకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై కొత్త బిల్లును రూపొందించింది. ఇక నుంచి పొగాకు ఉత్పత్తుల అమ్మకానికి అనుమతించే వయసును 18 ఏళ్ల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు సవరణ చట్టం 2020 (ప్రకటనలపై నిషేధం, వ్యాపార నియంత్రణ, వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ) పేరుతో ఇప్పటికే ప్రభుత్వం ముసాయిదాను రూపొందించింది. ఈ కొత్త బిల్లు ద్వారా వయో పరిమితిని 21 ఏళ్లకు వరకు పెంచనున్నారు. ఈ మేరకు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003కి సవరణ చేయనున్నారు. దీని ప్రకారం.. 21 ఏళ్లలోపు వారికి ఎవరూ సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు అమ్మడం, అమ్మేలా ప్రోత్సహించడం, కొనుగోలు చేయడానికి అనుతించడం వంటివి చేయకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రేండేళ్లు జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. రెండోసారి కూడా దోషిగా తేలితే ఐదేళ్లు జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధిస్తారు.

Also Read: ఇది బీజేపీ వ్యాక్సిన్, తీసుకోబోను, మా ప్రభుత్వం వస్తే అందరికీ ఉచితంగా టీకామందు , సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్