తెలంగాణలో మరో మూడురోజుల పాటు విస్తారంగా వర్షాలు

వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో మరో మూడురోజుల పాటు విస్తారంగా వర్షాలు
Follow us

|

Updated on: Aug 12, 2020 | 8:14 AM

Telangana Rain Alert : వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గ‌త కొన్ని రోజులుగా ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసిందే. మంగళవారం కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములతో, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. బుధ, గురు వారాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. తెలంగాణ‌లో రానున్న మూడు రోజుల్లో చాలా ప్రాంతాలలో వ‌ర్షాలు క‌రిసే ఛాన్స్ ఉంద‌ని తెలిపారు

నేడు, రేపు… నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, నిర్మల్, కొమురభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఇక ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వివ‌రించారు.

Also Read : నేడే ‘వైఎప్సార్ చేయూత’ : వారి ఖాతాల్లోని నేరుగా రూ.18,750