Rain alert : నాలుగు రోజుల్లో తెలంగాణకు భారీ వర్షాలు

రాగల నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, కొమురంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఈ నెల 19 వరకు భారీవర్షాలకు అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో సాధారణం కంటే మూడు శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. నాలుగు రోజులపాటు భారీ వర్షాలతో సాధారణ స్ధాయికి చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణాతోపాటు మధ్యప్రదేశ్, […]

Rain alert : నాలుగు రోజుల్లో తెలంగాణకు భారీ వర్షాలు
Follow us

| Edited By:

Updated on: Sep 16, 2019 | 11:54 AM

రాగల నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, కొమురంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఈ నెల 19 వరకు భారీవర్షాలకు అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో సాధారణం కంటే మూడు శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. నాలుగు రోజులపాటు భారీ వర్షాలతో సాధారణ స్ధాయికి చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణాతోపాటు మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో చందానగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 12 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్టు తెలిపారు. భారీ వర్షాల కురవనున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలన్నారు.

అయితే రాయలసీమ జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా కడప జిల్లా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో పల్లపు ప్రాంతాలు నీటముగినిపోయాయి. జిల్లా లోని పలుప్రాంతాల్లో వర్షాలు.. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు జమ్మలమడుగు ప్రొద్దుటూరు రైల్వే మార్గంలో పట్టాలపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న విజయవాడ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలును ప్రొద్దుటూరు సమీపంలో రైల్వే అధికారుల నిలిపివేశారు. అదే విధంగా కర్నులు జిల్లాలో సైతం భారీ వర్షం కురిసింది.