మేడమ్ ట్రైనింగ్… రాహుల్ రైజింగ్… సెకండ్ ఇన్నింగ్‌కి రె’ఢీ’!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టబోతున్నారా? పార్టీ నేతలే ఈ డిమాండ్ చేసే విధంగా హస్తం ముఖ్యులు ఎత్తులు వేస్తున్నారా? యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో ఈ భారీ ఆపరేషన్ సాగుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పార్టీలో వృద్ధ నేతలు యువనేతలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని పేర్కొంటూ ముఖ్యనేతలైన అశోక్ తన్వర్ – సంజయ్ నిరుపమ్ – ప్రద్యుత్ దెబర్ మాన్ తిరుగుబాటు చేయడం పార్టీలో అసంతృప్తికి కారణం కాదని…రాహుల్ కు […]

మేడమ్ ట్రైనింగ్... రాహుల్ రైజింగ్... సెకండ్ ఇన్నింగ్‌కి రె'ఢీ'!
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 2:34 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టబోతున్నారా? పార్టీ నేతలే ఈ డిమాండ్ చేసే విధంగా హస్తం ముఖ్యులు ఎత్తులు వేస్తున్నారా? యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో ఈ భారీ ఆపరేషన్ సాగుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పార్టీలో వృద్ధ నేతలు యువనేతలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని పేర్కొంటూ ముఖ్యనేతలైన అశోక్ తన్వర్ – సంజయ్ నిరుపమ్ – ప్రద్యుత్ దెబర్ మాన్ తిరుగుబాటు చేయడం పార్టీలో అసంతృప్తికి కారణం కాదని…రాహుల్ కు తిరిగి పగ్గాలు అప్పగించడమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పార్టీలో ఉన్న చాలామంది జూనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. మరోమాటలో చెప్పాలంటే.. సోనియా కోటరీ.. రాహుల్ సన్నిహితులను తప్పిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  భవిష్యత్తుపై వారిలో అయోమయం నెలకొంది. రాజీనామాల బాట పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విపాసన నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాంబోడియా వెళ్లారన్న వార్త ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాహుల్ ఎందుకు విదేశీ పర్యటనకు వెళ్లారు? ఎందుకు ఆయన మౌనం వహిస్తున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతుందనేది రాజకీయవర్గాల మాట. రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు సీనియర్ నేతలు (ముఖ్యంగా సోనియా గాంధీ కోటరీ) అసంతృప్తికి గురయ్యారు. ఆయన పనితీరుపై పలు సందర్భాల్లో అసమ్మతి తెలిపారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ సూచనలకు మద్దతు కరువైంది.

రాఫెల్ వివాదం విషయంలో ప్రధాని మోదీపై రాహుల్ విమర్శల దాడి చేసినప్పుడు కొద్ది మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. ఇక లోక్ సభ ఎన్నికల ఫలితాలు రాహుల్ ను షాక్ కు గురిచేశాయి. సీనియర్ నేతలు ఎప్పటికీ తనకు అండగా నిలువరని భావించడం ఆయన రాజీనామా చేయడానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే వారి అడ్డుతొలగించుకునేందుకు సీనియర్లపై తీవ్ర విమర్శలు చేస్తూ యువనేతలు పార్టీని వీడుతున్నారు. వీటిని రాహుల్ – సోనియా తర్వాత ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఎన్నికల ముంగిట, ప్రస్తుతం సోనియా దృష్టి అంతా సీనియర్లను తప్పించడంపైనే ఉందని సమాచారం. తద్వారా యువనేతలకు లేదా రాహుల్ టీంకు మార్గం సుగమం చేయనున్నారు. రాహుల్ విపాసన కార్యక్రమం.. ఆయన సెకండ్ ఇన్సింగ్స్‌కు ప్రారంభమని నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంచనాల ప్రకారం హర్యానా – మహారాష్ట్రలో పార్టీకి ఓటమి తప్పదు. ఎన్నికల ముంగిట – ప్రస్తుతం సోనియా దృష్టి అంతా సీనియర్లను తప్పించడంపైనే ఉందని సమాచారం. ఈ ఓటమితో సీనియర్లకు చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. తద్వారా యువనేతలకు లేదా రాహుల్ టీంకు మార్గం సుగమం చేయనున్నారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో – పార్టీ పగ్గాలు రాహుల్ చేపట్టాలనే డిమాండ్ సైతం ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల ముంగిట రాహుల్ విదేశాలకు వెళ్లడంపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత ప్రజాస్వామిక సంప్రదాయంలో వ్యక్తిగత స్వేచ్ఛకు ఎప్పుడూ గౌరవముందని, వ్యక్తిగత విషయాలను ప్రజా జీవితంతో ముడిపెట్టకూడదని స్పష్టంచేసింది. విదేశాల్లో ఉన్నప్పుడు ఎస్పీజీ భద్రతకు సంబంధించి నిబంధనల్లో చేసిన మార్పులపై తమ నేతలకు ఎలాంటి సమాచారం అందలేదని ఆ పార్టీ పేర్కొంది. విదేశాల్లో ఉన్నప్పుడు కూడా నేతలకు ఎస్పీజీ భద్రత కల్పించనున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..