జీడీపీలో ‘అద్భుతమైన వృద్ధి’, మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్, పెట్రో ఉత్పత్తుల ధరలే నిదర్శనమని వ్యాఖ్య

జీడీపీలో అద్భుతమైన వృద్ది కనిపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..మోదీ ప్రభుత్వంపై సెటైర్ వేశారు. పెట్రోలు, డీసెల్ ధరల పెరుగుదల గురించి..

జీడీపీలో 'అద్భుతమైన వృద్ధి', మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్, పెట్రో ఉత్పత్తుల ధరలే నిదర్శనమని వ్యాఖ్య
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 24, 2021 | 12:34 PM

జీడీపీలో అద్భుతమైన వృద్ది కనిపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..మోదీ ప్రభుత్వంపై సెటైర్ వేశారు. పెట్రోలు, డీసెల్ ధరల పెరుగుదల గురించి ప్రస్తావిస్తూ ఆయన…ద్రవ్యోల్బణంతో  సామాన్యులు బాధ పడుతుంటే ప్రభుత్వం పన్నుల సేకరణలో బిజీగా ఉందన్నారు. జీడీపీలో మోదీజీ సర్కార్ అద్భుతమైన వృద్దిని సాధిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దేశంలో ఈ వారంలో నాలుగోసారి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర  రూ. 85.70 ఉండగా ముంబైలో రూ. 92.28 చొప్పున ఉంది. డీసెల్ ధర కూడా దాదాపు ఇదే స్థితిలో ఉంది.  కాగా-సౌదీ అరేబియా నుంచి దేశానికి ఆయిల్ దిగుమతులు తగ్గడమే కారణమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. గత ఏడాది పాండమిక్ ప్రబలినప్పటి నుంచి ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే రోజుకు సుమారు 10 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతులు తగ్గుతూ వచ్చాయని అయన చెప్పారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతున్నాయి. వంట గ్యాస్ పై కూడా ఈ ప్రభావం పడుతోంది.