క్వారెంటైన్‌‌పై ఎవరి దారి వారిదే..

క్వారెంటైన్‌‌పై ఎవరి దారి వారిదే..

మూడో విడత లాక్ డౌన్ పొడిగించిన కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వలస కార్మికుల రాక ఆయా రాష్ట్రాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులను పెంచకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది.

Rajesh Sharma

|

May 04, 2020 | 12:26 PM

మూడో విడత లాక్ డౌన్ పొడిగించిన కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వలస కార్మికుల రాక ఆయా రాష్ట్రాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులను పెంచకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో పలు రాష్ట్రాలు తమ రాష్ట్రాల పరిధిలోకి వచ్చే వలస కార్మికులు ఎన్ని రోజులు క్వారెంటైన్‌లో ఉండాలనే విషయంపై రాష్ట్రాలు ఎవరికి అనుకూలమైన నిర్ణయం వారు తీసుకుంటున్నాయి. వలస కార్మికులను నేరుగా వారి ఇళ్లకు పంపించడం కుదరదని.. ఖచ్చితంగా వారంతా క్వారెంటైన్‌లోనే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిస్తున్నాయి.

కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు పలు రాష్ట్రాలు తమ రాష్ట్రాల పరిధిలోకి వచ్చే వలస కార్మికులు ఎన్నిరోజులు క్వారెంటైన్‌లో ఉండాలనే విషయంపై నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే వలస కార్మికులు 20 మంది కంటే ఎక్కువ గుంపుగా వస్తే వారందరికీ విధిగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం. దాంతో పాటు వారి పరీక్షల రిపోర్టులు వచ్చే వరకు వారంతా కచ్చితంగా క్వారెంటైన్ సెంటర్లలోనే వుండాల్సి వుంటుంది.

బీహార్ రాష్ట్రంలోకి వచ్చే వలస కార్మికులు కచ్చితంగా 21 రోజులపాటు క్వారెంటైన్లో ఉండాలని అక్కడి నితీష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రబలిన అప్పటినుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్న ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వలస కార్మికుల విషయంలోనూ అదే రకంగా నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో వలస కార్మికులు కచ్చితంగా 14 రోజులపాటు క్వారెంటైన్లో ఉండాలని నిర్ణయించారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చే వలస కార్మికులు ప్రభుత్వం సూచించిన క్వారెంటైన్ సెంటర్‌లోనే 14 రోజులపాటు వుండాలని నిర్దేశించారు.

కేరళ, కర్ణాటక లడక్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలకు వచ్చే వలస కార్మికులు 14 రోజుల పాటు క్వారెంటైన్లో ఉండాలని ఆదేశిస్తున్నాయి. వీరిలో జమ్ము-కాశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతం కొంత వేరే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అనుమతితో రాష్ట్రంలోకి వచ్చే వలస కార్మికులు 14 రోజులు హోం క్వారెంటైన్‌ ఉండాలని.. అదే సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా 21 రోజుల పాటు ప్రభుత్వం నిర్దేశించిన సెంటర్లలో ఉండాలని నిర్ణయం తీసుకుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu