కెవ్వు.. కెవ్వు.. ఐదు ఓట్లు.. ఇంట్లో వెన్నుపోట్లు

తన ఇంట్లో మొత్తం తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారని, కానీ తనకు ఐదు ఓట్లే పడ్డాయని లోక్‌సభకు పోటీ చేసిన ఓ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. సొంతవాళ్లే తనకు ఓటేయలేదని ఆయన మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. పంజాబ్‌లో ఈ సంఘటన జరగగా.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పంజాబ్‌లోని జలంధర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నీతు సుతేరన్ పోటీ చేశారు. కౌంటింగ్‌ చేస్తున్న సమయంలో ఆయనకు ఐదు ఓట్లు వచ్చినట్లు అధికారులు […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:41 pm, Fri, 24 May 19
కెవ్వు.. కెవ్వు.. ఐదు ఓట్లు.. ఇంట్లో వెన్నుపోట్లు

తన ఇంట్లో మొత్తం తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారని, కానీ తనకు ఐదు ఓట్లే పడ్డాయని లోక్‌సభకు పోటీ చేసిన ఓ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. సొంతవాళ్లే తనకు ఓటేయలేదని ఆయన మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. పంజాబ్‌లో ఈ సంఘటన జరగగా.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పంజాబ్‌లోని జలంధర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నీతు సుతేరన్ పోటీ చేశారు. కౌంటింగ్‌ చేస్తున్న సమయంలో ఆయనకు ఐదు ఓట్లు వచ్చినట్లు అధికారులు అనౌన్స్ చేశారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన ఇంట్లో వాళ్లే వెన్నుపోటు పొడిచారంటూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆ తరువాత అసలు విషయం బయటికొచ్చింది. జలంధర్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో 19వ స్థానంలో నిలిచిన సుతేరన్‌ 856 ఓట్లు సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ వెల్లడించింది. అయితే తొలి రౌండ్ల లెక్కింపులో భాగంగా ఆయనకు 5 ఓట్లు రాగా.. అవే తనకు పడిన మొత్తమని అని సుతేరన్ భ్రమపడ్డారు. దీంతో ఆవేశం తట్టుకోలేక బోరున ఏడ్చేశారు సుతేరన్.