వచ్ఛేశా ! వచ్చేశా ! ఇండియాలోకి ‘దేశీ’ పబ్ జీ ప్రవేశం ! ఇక యువతదే ఫుల్ జోష్ !
ఇండియాలో పబ్ జీ ప్లేయర్స్ కి శుభవార్త ! 'పబ్ జీ మొబైల్ ఇండియా' పేరిట తాము దీన్ని లాంచ్ చేస్తున్నట్టు పబ్ జీ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ కొత్త వెర్షన్ కి ఇదే పేరు పెట్టినట్టు..
ఇండియాలో పబ్ జీ ప్లేయర్స్ కి శుభవార్త ! ‘పబ్ జీ మొబైల్ ఇండియా’ పేరిట తాము దీన్ని లాంచ్ చేస్తున్నట్టు పబ్ జీ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ కొత్త వెర్షన్ కి ఇదే పేరు పెట్టినట్టు వెల్లడించింది. ఇటీవల దేశంలో పబ్ జీని నిషేధించిన తెలిసిందే. కానీ ఈ నూతన వెర్షన్ ఇండియన్ యూజర్స్ కి ఉద్దేశించి డిజైన్ చేసిందేనని ఈ సంస్ట స్పష్టం చేసింది. ఈ గేమ్స్ లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ పూర్తి డ్రెస్ లోనే ఉంటాయని పేర్కొంది. కాగా అధికారికంగా ఏ తేదీన లాంచ్ చేస్తామన్నది త్వరలో ప్రకటిస్తామని పబ్ జీ కార్పొరేషన్ తెలిపింది. ఇంతేకాదు. ఇండియాలో నిరుద్యోగ సమస్యని కొంతలో కొంతయినా తీర్చేందుకు వివిధ రంగాల్లో ప్రవేశం ఉన్న 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సంస్థ వెల్లడించింది. బిజినెస్, ఎగుమతులు, గేమ్ డెవలప్ మెంట్ వంటి వేర్వేరు రంగాల్లో అభినివేశం ఉన్నవారిని ఇది నియమిస్తుందట! ‘ప్రమోట్ హెల్దీ గేమ్ ప్లే హాబిట్స్ ఫర్ యంగర్ ప్లేయర్స్’ అన్నదే తమ నినాదమని పబ్ జీ కార్పొరేషన్ పేర్కొంది.