పటాన్​చెరు మండలంలో కలకలం..శాంపిల్ క్షిపణి మిస్​ ఫైర్.. భయాందోళనకు గురైన స్థానికులు..

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం భానూరులోని బీడీఎల్​ పరిశ్రమలో తయారు చేసిన ఓ శాంపిల్ క్షిపణి మిస్‌ ఫైర్‌ అయ్యింది. ఆ క్షిపణి వేగానికి సంబంధించి టెస్టులు చేస్తుండగా ...

పటాన్​చెరు మండలంలో కలకలం..శాంపిల్ క్షిపణి మిస్​ ఫైర్.. భయాందోళనకు గురైన స్థానికులు..
Follow us

|

Updated on: Nov 27, 2020 | 8:19 AM

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం భానూరులోని బీడీఎల్​ పరిశ్రమలో తయారు చేసిన ఓ శాంపిల్ క్షిపణి మిస్‌ ఫైర్‌ అయ్యింది. ఆ క్షిపణి వేగానికి సంబంధించి టెస్టులు చేస్తుండగా …పరిశ్రమ గోడపై నుంచి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దాదాపు 3 కిలోమీటర్ల దూరంలోని ఓ వ్యవయసాయ పొలంలో పడి… కొంతమేర భూమిలోకి చొచ్చుకుపోయింది. ఓ గ్రామస్థుడు ఇచ్చిన సమాచారం మేరకు సీఐఎస్​ఎఫ్​ అధికారులు క్షిపణిని స్వాధీనం చేసుకున్నారు.

మిస్‌ఫైర్‌ అయిన సమయంలో పెద్ద శబ్దం రాగా… చుట్టు పక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వేగ సామర్థ్యానికి సంబంధించి రీడింగ్‌ లెక్కిస్తుండగా… రెండు తీగలు ఒకదానికొకటి తాకి మిస్‌ఫైర్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. విజిలెన్స్‌ అధికారులతో ఓ స్పెషల్ కమిటి వేశారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రత్యక్షంగా ఉన్న ముగ్గురు ఉద్యోగులతో పాటు మరో 15 మందిని అంతర్గతంగా విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read :

స్టార్ హీరోలు కూడా చేయలేని రిస్క్ చేస్తోన్న కియారా, మరి అమ్మడు అదరగొడుతుందా..?

రూటు మార్చిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు..వారు అలా..వీరు ఇ

ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు