ఇటు ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’, అటు పళ్లాలను చరుస్తూ అన్నదాతల నిరసన, అన్నట్టే చేశామంటూ వ్యాఖ్య

ఆదివారం ప్రధాని మోదీ 'మన్ కీ బాత్ ' కార్యక్రమం జరుగుతుండగా దీనికి నిరసన వ్యక్తం చేస్తూ అన్నదాతలు పళ్ళాలు చరుస్తూ ప్రొటెస్ట్ చేశారు. మూడు చోట్ల..సింఘు బోర్డర్ లోను, పంజాబ్ లోని..

ఇటు ప్రధాని మోదీ  'మన్ కీ బాత్', అటు పళ్లాలను చరుస్తూ అన్నదాతల నిరసన, అన్నట్టే చేశామంటూ వ్యాఖ్య
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 27, 2020 | 3:29 PM

ఆదివారం ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్ ‘ కార్యక్రమం జరుగుతుండగా దీనికి నిరసన వ్యక్తం చేస్తూ అన్నదాతలు పళ్ళాలు చరుస్తూ ప్రొటెస్ట్ చేశారు. మూడు చోట్ల..సింఘు బోర్డర్ లోను, పంజాబ్ లోని ఫరీద్ కోట్ లోను, హర్యానాలో రోహ్తక్ లోను వారీ వెరైటీ నిరసనకు దిగారు. తాలీ బజావో పేరిట తామిలా ఆందోళన చేస్తామని రైతు సంఘాలు ఇదివరకే ప్రకటించాయి. డిసెంబరు 27 న మోదీ మన్ కీ బాత్ రేడియో ప్రసంగం చేస్తారని, ఈ కార్యక్రమంలో మీ మాటలు వినీవినీ విసుగెత్తిపోయామని, ఇక మా మాటలు ఎప్పుడు వింటారని ఆనాడే తాము చెప్పినట్టు స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ అన్నారు. ఇలా పళ్ళా లు చరుస్తూ శబ్దం చేయడంవల్ల మీ మన్ కీ బాత్ మాటలు మాకు చేరకుండా పోతాయి అని ఆయన పేర్కున్నారు.

నిజానికి మీరు నేర్పిన విద్యయే అన్నట్టులోగడ దేశంలో కరోనావైరస్ ప్రబలిన సమయంలో రోగులకు సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ సిబ్బందిని అభినందిస్తూ చప్పట్లు కొట్టాలని, పళ్ళాలు చరచాలని మోదీయే నాడు  పిలుపునిచ్చారు.  ఇప్పుడు రైతులు తమ నిరసనను తెలిపేందుకు అదే పధ్ధతిని ఎంచుకున్నారు. ఇక యధావిధిగా రైతు చట్టావల్ల కలిగే ప్రయోజనాలను మోదీ పునరుద్ఘాటించారు.