బ్లాక్ బస్టర్ మూవీ ‘జెంటిల్ మేన్’కు సీక్వెల్

అర్జున్-శంకర్ కాంబినేషన్లో 27ఏళ్ల క్రితం తెరకెక్కిన 'జెంటిల్ మేన్' మూవీ ఎంతటి సంచలనం చేసిందో తెలిసిందే. అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందీ మూవీ. ఈ సినిమాని తమిళంలో..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 9:53 pm, Thu, 10 September 20
బ్లాక్ బస్టర్ మూవీ 'జెంటిల్ మేన్'కు సీక్వెల్

అర్జున్-శంకర్ కాంబినేషన్లో 27ఏళ్ల క్రితం తెరకెక్కిన ‘జెంటిల్ మేన్’ మూవీ ఎంతటి సంచలనం చేసిందో తెలిసిందే. అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందీ మూవీ. ఈ సినిమాని తమిళంలో నిర్మించిన నిర్మాత కె.టి.కుంజుమోన్ తాజాగా ఒక బిగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నట్టుగా కుంజుమోన్ ప్రకటించారు. ‘జెంటిల్ మేన్ ఫిలిం ఇంటర్నేషనల్’ బ్యానర్ పై ‘జెంటిల్ మేన్ 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. పాన్ ఇండియా ఫిలింగా దీనిని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, దీనికి కూడా శంకర్ దర్శకత్వం వహిస్తారా? లేక మరొకరు డైరెక్ట్ చేస్తారా అన్నదానిపై నిర్మాత క్లారిటీ ఇవ్వలేదు. నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలు త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం. కాగా, 1993లో తమిళనాట సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులోకి అదే పేరుతో అనువాదం చేశారు. ఇక్కడా ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో అర్జున్, మధుబాల హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సక్సెస్ కావడంతో శంకర్ తిరిగి చూసుకోలేదు. అత్యంత భారీ బడ్జెట్ సినిమాలతో టాప్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ గా మన్ననలు అందుకున్నారు శంకర్