యూపీలో గోసంరక్షణ ఇలాగేనా ? సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లేఖ, తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థన

ఉత్తర ప్రదేశ్ లో గోవుల పరిస్థితిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల లలిత్ పూర్ లో కొన్ని ఆవుల కళేబరాల ఫోటోలను చూసిన ఆమె..

యూపీలో గోసంరక్షణ ఇలాగేనా ? సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లేఖ, తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థన
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Dec 21, 2020 | 5:51 PM

ఉత్తర ప్రదేశ్ లో గోవుల పరిస్థితిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల లలిత్ పూర్ లో కొన్ని ఆవుల కళేబరాల ఫోటోలను చూసిన ఆమె.. బహుశా అవి తగినంత ఆహారం, నీరు లేక మరణించినట్టు కనిపిస్తోందని అన్నారు. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాస్తూ గో సంరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా ఈ విధమైన ఫోటోలను చూశానని, గోశాలలు నిర్మిస్తామని మీరు ఇఛ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. గోశాలల్లో పరిస్థితులు దుర్భరంగా ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. ఛత్తీస్ గఢ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం గో ధన్ న్యాయ్ యోజన వంటి పథకాన్ని చేబట్టిందని, ఆ విధమైన పథకాలను యూపీ ప్రభుత్వం కూడా చేపట్టాలని ప్రియాంక గాంధీ సూచించారు.

మీ బీజేపీ కార్యకర్తలు గోసంరక్షకులుగా మారుతారని ఆశిస్తున్నానని  ఆమె పేర్కొన్నారు.  గోశాలల నిర్వాహకులకు అదనపు సౌకర్యాలు కల్పించాలని ఆమె అభిప్రాయపడ్డారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu