Priyamani: వెబ్ సిరీస్ ల‌పై మ‌క్కువ చూపిస్తోన్న ప్రియ‌మ‌ణి.. కొన్ని సీక్రెట్స్ కూడా రివీల్ చేసిందండోయ్

కెరీర్‌ ఫుల్ ఫాంలో ఉండగానే బ్రేక్‌ తీసుకున్న డస్కీ బ్యూటీ ప్రియమణి మళ్లీ బిజీ అయ్యారు. హీరోయిన్‌గా స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తున్న టైంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు..

Priyamani: వెబ్ సిరీస్ ల‌పై మ‌క్కువ చూపిస్తోన్న ప్రియ‌మ‌ణి.. కొన్ని సీక్రెట్స్ కూడా రివీల్ చేసిందండోయ్
Follow us

|

Updated on: May 12, 2021 | 7:38 PM

కెరీర్‌ ఫుల్ ఫాంలో ఉండగానే బ్రేక్‌ తీసుకున్న డస్కీ బ్యూటీ ప్రియమణి మళ్లీ బిజీ అయ్యారు. హీరోయిన్‌గా స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తున్న టైంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యారు ఈ భామ. హీరోయిన్‌గా మల్టీ లింగ్యువల్‌ స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ రీ ఎంట్రీలో మల్టీ ప్లాట్‌ఫార్మ్స్‌లో వర్క్‌ చేస్తున్నారు. సినిమాలతో పాటు టీవీ, వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. నేషనల్‌ లెవల్‌లో సూపర్ హిట్ అయిన ఫ్యామిలీ మాన్ లాంటి వెబ్‌ సిరీస్‌లతో పాటు కాంట్రవర్షియల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన `హిజ్‌ స్టోరి` లాంటి షోస్‌లో కూడా చేస్తున్నారు. రీసెంట్‌ ఇంటర్వ్యూలో వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ సంబంధించిన సీక్రెట్స్‌ రివీల్ చేశారు ప్రియమణి. సినిమాలతో పోలిస్తే వేగంగా తక్కువ బడ్జెట్‌లో వెబ్‌ సిరీస్‌లు ఎలా రెడీ అవుతున్నాయో కూడా చెప్పారు.

వెబ్‌ కంటెంట్‌ షూటింగ్ సమయంలో సెట్‌ లో రెండు కెమెరాలు వర్క్ చేస్తుంటాయట.. అంటే ఎట్‌ ఎ టైమ్‌ రెండు సీన్స్ షూటింగ్ జరుగుతుంటాయన్న మాట. అంతేకాదు సినిమాల్లా డబ్బింగ్ ప్రాసెస్‌ లేకుండా వీలైనంత వరకు సింక్‌ సౌండ్ టెక్నాలజీతోనే షూట్‌ చేసేస్తారట. ఇలా చేయటం వల్లే రోజు ఐదారు సీన్లు కంప్లీట్‌ అవుతాయంటున్నారు ప్రియమణి. అందుకే సినిమాల కంటే తక్కువ కాస్ట్‌లో వెబ్‌ సిరీస్‌లు రెడీ అవుతున్నాయన్నారు.

Also Read: క‌రోనాతో టాలీవుడ్ లో మ‌రో విషాదం.. ద‌ర్శ‌కుడు విన‌య్ కుమార్ క‌న్నుమూత‌

 మే 20… యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు.. ఆ రోజున ఫ్యాన్స్ కు స్పెష‌ల్ ట్రీట్!