ఏపీలో రాజకీయ సెగ..రేపు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం..చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో మరో సారి పొలిటిక్ హీట్ పెరుగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యుల తీరుపై ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై రేపు కీలక భేటీ జరగబోతోంది. అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు....

  • Sanjay Kasula
  • Publish Date - 4:57 pm, Tue, 22 December 20
ఏపీలో రాజకీయ సెగ..రేపు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం..చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో మరో సారి పొలిటిక్ హీట్ పెరుగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యుల తీరుపై ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై రేపు కీలక భేటీ జరగబోతోంది. అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు సభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారని ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు.

ఇప్పుడు వాటిపైనే ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాని గోవర్ధన్‌ ఆధ్వర్యంలో రేపు కీలక సమావేశం జరుగుతుంది. ఈ నెల మొదట్లో జరిగిన సమావేశాల్లో సంక్షేమంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగానే చేయూత పథకంపై ప్రశ్నలు సంధించారు నిమ్మల రామానాయుడు.

45 ఏళ్లు నిండినమహిళలకు పెన్షన్‌ ఇస్తానని చెప్పి… ఇప్పుడు ఏడాదికి 17,500 రూాపాయలు ఇస్తున్నారని, దాని వల్ల లబ్దిదారులు నష్టపోతున్నారని విమర్శించారు. నిమ్మల కామెంట్స్‌పై సీఎం జగన్‌ తీవ్రంగా స్పందించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న నిమ్మలపై తానే స్వయంగా ప్రివిలేజ్‌ నోటీసు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.