తెలంగాణ : నేటి నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో క‌రోనా రోగుల‌కు వైద్య సేవ‌లు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి ప‌రిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

తెలంగాణ : నేటి నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో క‌రోనా రోగుల‌కు వైద్య సేవ‌లు
Follow us

|

Updated on: Jul 02, 2020 | 11:13 AM

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి ప‌రిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా క‌రోనా రోగుల‌కు వైద్య సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను సందర్శించారు. నేటి నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా పేషెంట్ల‌కు ట్రీట్మెంట్ అందించేంచుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో.. దాదాపుగా 15వేల బెడ్స్ ఇందుకోసం అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు మెడికల్ కాలేజీలు కరోనా చికిత్స అందించేందుకు స్వ‌యంగా ముందుకు వచ్చాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా ఆస్పత్రులను కూడా కోవిడ్ సేవలకు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇవ్వడంతో.. హైదరాబాద్ లోని గాంధీ స‌హా మిగ‌తా ఆస్పత్రులపై ఒత్తిడి త‌గ్గే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి.