FD Rate Hike: కస్టమర్లకు శుభవార్త.. వారంలో రెండోసారి ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకింగ్ దిగ్గజం..

FD Rate Hike: దేశంలోని ప్రముఖ బ్యాంక్ ఈ వారంలో రెండవసారి తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ FD రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

FD Rate Hike: కస్టమర్లకు శుభవార్త.. వారంలో రెండోసారి ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకింగ్ దిగ్గజం..
Follow us

|

Updated on: Jun 17, 2022 | 9:52 PM

FD Rate Hike: ప్రైవేటు రంగంలోని HDFC బ్యాంక్ ఈ వారంలో రెండవసారి ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ FD రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు జూన్ 17, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ FD మొత్తాలకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. HDFC బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. 7 రోజుల నుంచి 29 రోజుల వరకు FDలపై ఇప్పుడు 2.50 శాతం నుంచి 2.75 శాతం చెల్లిస్తోంది. 30 రోజుల నుంచి 90 రోజుల వరకు.. డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పుడు 3 శాతం నుంచి 3.25 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. 91 రోజుల నుంచి 6 నెలల వరకు ఉండే FDలపై 3.50 శాతం నుంచి 3.75 శాతం, ఏడాది నుంచి 2 సంవత్సరాల FDలకు 5.10 శాతం నుంచి 5.35 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

ఇప్పుడు 2 సంవత్సరాల ఒక్క రోజు నుంచి 3 సంవత్సరాల వరకు అందించే వడ్డీ రేటును 5.50 శాతానికి పెంచింది. 3 సంవత్సరాల ఒక్క రోజు నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటును 5.60 శాతం నుంచి 5.70 శాతానికి పెంచింది. జూన్ 8, 2022న జరిగిన ద్రవ్య విధాన సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇది ఒక నెలలోపు సెంట్రల్ బ్యాంక్ మొత్తం రేటు పెంపును 90 bpsకి తీసుకొచ్చింది. రాబోయే నెలల్లో మరిన్ని బ్యాంకులు FD రేట్లను పెంచుతాయని తెలుస్తోంది. ఇది FD పెట్టుబడిదారులకు మంచి శుభవార్తనే చెప్పుకోవాలి.

వచ్చే 1-2 సంవత్సరాల్లో FDలపై వడ్డీ 8%కి పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 8% వడ్డీ అనేది FD పెట్టుబడిదారులకు మంచి రాబడిని ఇస్తుంది.  కాబట్టి డిపాజిట్ రేట్లు ఆ స్థాయికి చేరుకునే అవకాశం ఎంత అనేది తెలియాల్సి ఉంది. అయితే.. డిపాజిట్లపై వడ్డీ రేటు పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రెండు మూడు త్రైమాసికాల్లో ఇది 100 నుంచి 150 బేసిస్ పాయిట్ల వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!