పృథ్వీ షా ఆట‌తీరుపై పాంటింగ్ ప్ర‌శంస‌లు

ఐపీఎల్ 13వ సీజ‌న్‌కు రంగం సిద్ద‌మైంది. ఇంకో 13 రోజుల్లో పొట్టి క్రికెట్ స‌మ‌రం స్టార్ట్ కాబోతుంది. దీంతో అన్ని జ‌ట్లు ముమ్మ‌ర ప్రాక్టీస్ చేస్తున్నాయి.

పృథ్వీ షా ఆట‌తీరుపై పాంటింగ్ ప్ర‌శంస‌లు
Ram Naramaneni

|

Sep 06, 2020 | 12:09 PM

ఐపీఎల్ 13వ సీజ‌న్‌కు రంగం సిద్ద‌మైంది. ఇంకో 13 రోజుల్లో పొట్టి క్రికెట్ స‌మ‌రం స్టార్ట్ కాబోతుంది. దీంతో అన్ని జ‌ట్లు ముమ్మ‌ర ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఐపీఎల్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా నేడు విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెన‌ర్ పృథ్వీ షా శ‌నివారం నెట్స్‌లో జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ రికీ పాంటింగ్ ఆధ్వ‌ర్యంలో ప్రాక్టీస్ చేశాడు. సాధ‌న చేస్తున్నంత సేపు మంచి ఫుట్‌వ‌ర్క్ కొన‌సాగిస్తూ బారీ షాట్ల‌తో ఆక‌ట్టుకున్నాడు.

పృథ్వీ షా ఆట‌తీరును నిశితంగా గ‌మ‌నించిన‌ పాంటింగ్ అతనిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. పృథ్వీ షా టాలెంట్ సూప‌ర్ అంటూ మెచ్చుకున్నాడు. ముఖ్యంగా అత‌ని ఫుట్‌వ‌ర్క్ అద్భుతంగా ఉందని, పేస‌ర్ల‌ను టార్గెట్ చేస్తూ మంచి టైమింగ్‌తో అతను షాట్లు ఆడుతున్న‌ట్లు వివరించాడు. ఈ నేప‌థ్యంలో పృథ్వీ ఆడిన ఒక షాట్‌ను.. ‘నిజంగా అద్భుత‌మైన షాట్ ఆడావు .. వాట్ ఏ బ్యూటీ’ అంటూ కామెంట్ చేశాడు. ఈ విష‌యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ త‌న ట్విట‌ర్‌లో పంచుకుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా పాంటింగ్ వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ సీజ‌న్‌లో ఆ జ‌ట్టు ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుందో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also Read :

జ‌గ‌న్‌పై దాడి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు

జ‌గ‌న్ మార్క్ నిర్ణయం : మండలానికి రెండు పీహెచ్‌సీలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu